బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో కొనసాగింది కార్తీక దీపం (Karthika Deepam). ఫ్యామిలీ ప్రేక్షకులలో ఈ సీరియల్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొంత కాలంగా ఈ సీరియల్ టాప్ వన్ స్థానంలో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంది. వంటలక్క.. డాక్టర్ బాబు పాత్రలు తప్పించిన తర్వాత ఈ కార్తీక దీపం క్రేజ్ అమాంతం పడిపోయిండి. కొత్త పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ సీరియల్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ దీప (వంటలక్క) రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీప కోమా నుంచి బయటకు వచ్చినట్లు ప్రోమో కూడా విడుదల చేసి కన్ఫార్మ్ చేశారు మేకర్స్. ఇక ఆమెతోపాటు డాక్టర్ బాబు సైతం రీఎంట్రీ ఇస్తున్నారు.
డాక్టర్ బాబు తిరిగి రావడం గురించి స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఇప్పటికే కార్తీకదీపం సెట్లో అడుగుపెట్టినట్లు నిరుపమ్ తన ఇన్ స్టా ఖాతాలో ఫోటోస్ షేర్ చేశాడు. అందులో తలకు గాయంతో కుర్చీలో కుర్చొని చిరునవ్వులు చిందిస్తున్నాడు. డాక్టర్ బాబు ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వెల్ కమ్ డాక్టర్ బాబు అంటూ స్వాగతం పలుకుతున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.