Lakshmika Sajeevan: ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే గుండెపోటుతో యువనటి మృతి..

చిన్న వయసులోనే లక్ష్మీక గుండెపోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమకు షాక్‏కు గురి చేసింది. 'కాక్క' అనే షార్ట్ ఫిల్మ్‏లో పంచమిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో.. తన రంగు కారణంగా కుటుంబం ఆమెను తిరస్కరించడం.. తన లోపాన్ని చూసి ఆత్మస్థైర్యంతో జీవితాన్ని గెలిచిన అమ్మాయి కథే 'కాక్క'. ఇందులో తన నటనతో ప్రశంసలు అందుకుంది లక్ష్మిక. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. సౌదీ వెల్లక్కా.. పంచవర్ణతతా.. పూజయమ్మ.. ఉయారే.. ఒరు కుట్టనాథక్ బ్లాక్, నిత్యహరిత నాయగన్ వంటి సినిమాల్లో

Lakshmika Sajeevan: ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే గుండెపోటుతో యువనటి మృతి..
Lakshmika Sajeevan

Updated on: Dec 09, 2023 | 12:14 PM

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ (27) గుండెపోటుతో మృతి చెందింది. శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‏లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్ష్మీక గుండెపోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమకు షాక్‏కు గురి చేసింది. ‘కాక్క’ అనే షార్ట్ ఫిల్మ్‏లో పంచమిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో.. తన రంగు కారణంగా కుటుంబం ఆమెను తిరస్కరించడం.. తన లోపాన్ని చూసి ఆత్మస్థైర్యంతో జీవితాన్ని గెలిచిన అమ్మాయి కథే ‘కాక్క’. ఇందులో తన నటనతో ప్రశంసలు అందుకుంది లక్ష్మిక. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. సౌదీ వెల్లక్కా.. పంచవర్ణతతా.. పూజయమ్మ.. ఉయారే.. ఒరు కుట్టనాథక్ బ్లాక్, నిత్యహరిత నాయగన్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఒరు యమనందాన్ ప్రేమకథలోనూ లక్ష్మీక నటించింది. ఆమె చివరిసారిగా 2021లో కూన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు ప్రశాంత్ మొలికల్ దర్శకత్వం వహించారు. లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లక్ష్మిక ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేస్తుంటారు. ‘హోప్.. లైట్ డిస్పయింట్మెంట్ ఆల్ ఆఫ్ ది డార్కెనెస్’ అనే క్యాప్షన్ ఇస్తూ.. సూర్యుడు అస్తమిస్తున్నప్పటి ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే తిరగకుండానే కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.