ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఫిదా సినిమాను రిజెక్ట్ చేశారు.. సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల కన్నీటి పర్యంతం..

|

Apr 07, 2021 | 9:54 PM

Shekar Kammula:  ఆయన తీసే సినిమాలకు యూత్‏ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు కావు.. కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి

ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఫిదా సినిమాను రిజెక్ట్ చేశారు.. సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల కన్నీటి పర్యంతం..
Shekar Kammula
Follow us on

Shekar Kammula:  ఆయన తీసే సినిమాలకు యూత్‏ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు కావు.. కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసును హత్తుకుంటాయి ఆ డైరెక్టర్ సినిమాలు ఆయనేవరో కాదు.. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన శేఖర్ కమ్ముల తాజాగా లవ్ స్టోరీ అనే అందమైన ప్రేమకావ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‍ను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన శేఖర్ కమ్ముల.. తన పర్సనల్ విషయాలు, సినీ జర్నీకి సంబందించిన విషయాలను చెప్పుకోచ్చారు.

వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.. అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల. ఫిదా సినిమాలో ఈ సాంగ్ నా హైట్ గురించి రాయించుకున్నది కాదని.. వరుణ్ తేజ్ కూడా పొడుగే అంటూ అలీ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. వరుణ్ హైట్ తన హైట్ సమానమే కానీ.. ఆయనలో నేను సగం ఉంటా అంటూ నవ్వులు పూయించారు. ఇక పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను చెప్పుకోచ్చాడు శేఖర్ కమ్ముల. పెద్ద హీరోలతో వద్దని కానీ.. రిస్క్ అని కానీ అనుకోను. పలానా హీరోకి స్క్రిప్ట్ కుదురుతుంది అంటే.. చాలా సిన్సియర్‌గా వెళ్లి చెప్తాను.నేను చెప్పిన రోజులు ఉన్నాయి.. వాళ్లకి కథ నచ్చకపోతే లేదని చెప్పినవీ ఉన్నాయి అంటూ చెప్పుకోచ్చాడు. నా కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు.. ఫిదా సినిమా మహేష్ బాబుకి చెప్పా.. రామ్ చరణ్‌కి చెప్పా.. కానీ సెట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్‏ను కలిశా. అలా ఫిదా తెరపైకి వచ్చింది అంటూ చెప్పాడు.

ఇక సారంగ దరియా సాంగ్ గురించి చెప్పుకోస్తూ.. శేఖర్ కమ్ముల ఎమెషనల్ అయ్యారు. సాంగ్ లిరిక్స్ ను సుద్దాల అశోక్ తేజ గారు ఎంత వినసొంపుగా రాశారు. కానీ ఈ పాటపై వచ్చిన వివాదంతో ఆయన చాలా బాధపడ్డారు. ఆయన బాధపడినందుకు నేను బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత అలీ ఎదో చూపించగానే.. శేఖర్ కమ్ముల ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. అందుకు కారణం ఎంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

 

Also Read: ‘పుష్ప’ కోసం రంగంలోకి ఆస్కార్ విజేత.. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‏పీరియన్స్‏ను అందించనున్న సుకుమార్..