Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1078 వ ఎపిసోడ్ కి అడుగు పెట్టింది. రిజిస్టర్ ఆఫీసర్ లో మోనిత పెళ్లి డేట్ ను రిజిస్టర్ చేయమని ఆఫీసర్ అడుగుతుంది. అప్పుడు ఆఫీసర్ రిజిస్టర్ మ్యారేజ్ కు కొన్ని పద్ధతులుంటాయని చెబితే.. తనకు మూడో నెల అని చెబుతుంది మోనిత దీంతో 25 వ తేదీ ఉదయం 11 గంటలకు రమ్మని .. ఇద్దరు సాక్షులను తీసుకుని రమ్మనమని చెబుతాడు ఆఫీసర్.. వస్తారు కార్తీక్ అమ్మ సౌందర్య, మొదటి భార్య దీప సాక్షులుగా వస్తారని నవ్వుతు చెబుతుంది.
సౌందర్య దీపలు కూర్చుంటే.. హిమ శౌర్యలు వచ్చి అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారు అని అడిగితె.. డాడీ ఎక్కడికి వెళ్తాడు.. వెళ్ళితే నానమ్మ ఇంటికి.. లేదంటే హాస్పటల్ కి వెళ్తాడు.. అంటే.. అమ్మ డాడీ రాగానే అందరం కలిసి నానమ్మ ఇంటికి వెళ్దాం అంటే.. పుట్టినప్పటికీ నుంచి ఇంత చిన్నఇంట్లోనే బతికాను.. ఒక్కసారిగా అంత విశాలమైన ఇంట్లోకి వెళ్తే సరికి నాకు బాగా ఇరుకైనట్లు ఉంది.. అంటే.. అంత పెద్ద ఇల్లు ఇరుకేమిటి అంటే .. కొంతకాలం ఆగితే ఎక్కడ ఉండాలనేది క్లారిటీ వస్తుంది అంటుంది. దీప. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నశౌర్య ని సౌందర్య వారిస్తుంటే.. హిమ నువ్వు కూడా అమ్మకే సపోర్ట్ చేస్తున్నావు.. అంటుంది. దీంతో శౌర్య మా అమ్మ మీ ఇంటికి రావడం ఇష్టంలేదా అంటే.. అది మీ ఇల్లు అంటావేమిటి.. మన ఇల్లు అంటుంది సౌందర్య.
అమ్మకి , డాడీకి ఇంటికి రావచ్చు కదా అని చెప్పు.. అంటే ఎవరూ చెప్పారు.. నా చిన్నప్పటి నుంచి ఇంతే.. మనమే కనిపెట్టాలి.. తెలుసుకుంటాలే నానమ్మ.. నేనే తెలుసుకుంటా అంటే.. దీప పేదవారి కోసం క్లినిక్ ఓపెన్ చేశాడు కదా.. ఇందులో మంచి జరుగుతుంది అంటే.. ఇందులో కూడా ఎదో ఉంది అంటే.. హిమ అవును .. ఎదో ఉంది. ఇందాక మోనిత ఏమో.. నానమ్మదగ్గరకి వచ్చి కాళ్ళు మొక్కి వెళ్ళింది అంటుంది హిమ. అడిగితె ఏమీ చెప్పలేదు అంటుంది హిమ.
సౌందర్య కొత్త ఆసుపత్రి కోసం బిల్డింగ్ కొంటుందట బ్లేసింగ్స్ కోసం వచ్చింది అంటూ.. పిల్లల్ని సాంగ్స్ వినమని అంటే. శౌర్య.. చెప్పాను కదా ఇలా అడిగితె ఏమీ చెప్పరు అంటూ పద పాటలు విందాం అంటుంది.. హిమ దాచి పెట్టుకో అంటూ.. అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
దీప కోపంతో అది అక్కడికి వచ్చిందా అంటే.. చెప్పాను కదా అంటే.. అది పిల్లలే నమ్మలేదు.. నేను ఎలా నమ్ముతా.. అంటే.. నిజంగా అది అందుకే వచ్చిందా అంటే ఇంకేమి ఉంది కదా దాని దగ్గర తిరుగులేని అస్త్రం.. అది పట్టుకుని వచ్చి ఉంటుంది. కానీ అది మీ కాళ్ళు పట్టుకుని ఎందుకు ఆశీర్వాదం తీసుకుందో అది చెప్పండి అంటుంది దీప. అది ఎప్పుడు ఏమి చేస్తుందో దానికే తెలియదు.. దాని కడుపులో పుట్టే బిడ్డకు అన్యాయం చేయొద్దు అంటుంది అని సౌందర్య అనగానే .. దీప కోపం తో కుర్చీలో నుంచి లేచి నుంచుంటుంది. ఏ విధంగా న్యాయం చేయాలంట అంటే.. వంట చేయాలి.. దానికి దాని కడుపు గురించి తప్ప.. ఆయన ఎంత ఆకలితో వస్తారో అంటూ వెళ్ళుతుంది. దీనికి ఇప్పుడు పెళ్లి గురించి తెలిస్తే అని సౌందర్య ఆలోచిస్తుంది..
కార్తీక్ ని ఏమి ఆలోచిస్తున్నావు అంటే.. కార్తీక్ ఇంకెంత దూరం లాక్కుని వెళ్తావా అని ఆలోచిస్తున్నా అంటాడు. దూరం ఆలోచించే దగ్గరయ్యావా అంటే.. కార్తీక్ కోపంతో ఆపు ఏమనుకుంటున్నావు నా గురించి.. నీ మీద మోజు పడి ఈ స్థితి తీసుకొచ్చా అనుకుంటున్నావా లేదంటే నువ్వు నేను సహజీవనం చేస్తుంటే నీకు ఈ పరిస్థితి వచ్చిందా ఆరోజు నుంచి ఈ రోజు వరకూ నేను మౌనంగా ఉంది.. చేసిన తప్పుని అంగీకరించి కాదు అసలు నా వల్ల ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందో అర్ధం కాక అయోమయంతో మౌనంగా ఉన్నా నా మౌనం మోసానికి గుర్తు కాదు.. అంతేకాని.. నా వల్ల నీ జీవితం బలైపోయిందని కాదు.. నా వల్ల తప్పు జరిగి ఉండొచ్చు.. కానీ నావల్లే తప్పు జరగలేదు.. ఈ పరిస్థితికి ఇద్దరం కారణం.. నేను సృహలో లేను.. నువ్వు సృహలో ఉన్నావు.. అప్పుడు నీకు ఈ పరిస్థితి వస్తుందన్న సృహలేదు.. నన్ను సృహలోకి రప్పించాలన్న ధ్యాస కూడా లేదు పోనీ ఆ మర్నాడు మనం కలిసిప్పుడు చెప్పాలని.. లేదు.. ఎప్పుడైతే సర్పం నీ మెడకు చుట్టుకుందో.. దానిని నాకు చుట్టేశావు.. అది ఇప్పుడు నా సంసారానికి చుట్టుకుంది.. నా కాపురాన్ని కాటేసింది.. ఇక్కడ దాకా తెచ్చింది నువ్వు.. సాక్ష్యంగా మా అమ్మ, నా భార్య వస్తారని అంత ధీమా ఎలా చెబుతున్నావు నువ్వు వాళ్ళు దేనికి సాక్ష్యం చెబుతారు. మనం చేసిన తప్పుకా .. రేపు 25న చేయబోయే తప్పుకా .. వాళ్ళు వస్తారని ఎలా అనుకుంటున్నావు అని కోపం తో ప్రశ్నిస్తాడు కార్తీక్.
వాళ్ళని తీసుకుని రావాలిన బాధ్యత నాది కాదు నీది.. నేను దీప అంత పిచ్చిదానిని కాదు… తండ్రి ఎవరో తెలియకుండా పెంచాడనికి నేను మోనితను.. జరగాల్సిన న్యాయానికి సాక్ష్యాలు కావాలి కనుక తీసుకుని రమ్మనమని అంటున్నా అంటే.. ఎందుకు వస్తుంది నా భార్య.. ఎలా వస్తుంది పదేళ్ల పాటు చేయని తప్పుకు బలైపోయి నరకంలో బతికింది. నిజంగా వెర్రిదే .. నాలో మార్పు కోసం ఎదురు చూసింది. పదేళ్ల క్రితం ఒక ఆడదానికి ఆత్మాభిమానానికి.. ఒక పురషుహంకారానికి నిలువెత్తు నిదర్శంగా మారింది. ఇప్పుడు నిజంగా నాలో మానవత్వం అనేది ఉంటె దీప గుడి కట్టాలి నేను.. కానీ ఆమె ఆశలకు సమాధి కట్టమంటున్నావు నువ్వు అది నా వల్ల కాదు అంటాడు కార్తీక్.
అప్పుడు నిర్ణయం నీదే కాదు కార్తీక్.. నేను భర్తలేని భార్యగా బతకలేను.. నాకు న్యాయం కావలి.. దీపకి గుడి కడతావో తాజ్ మహల్ కడతావో నాకు ఎందుకు నా మేడలో తాళి కడతావో లేదో అంతవరకే ఆలోచిందేది.. దీపని వదిలేసి.. నన్ను పెళ్లి చేసుకోబోయి మీ అమ్మ వచ్చి ఆపితే ఆగిపోయావు అంటూ గతం గుర్తు చేస్తుంది. అన్ని సార్లు నీ మాట విన్నా .. మోసపోయాను.. ఇంకా ఇంకా మోసానికి గురికావడానికి నేను సిద్ధంగా లేను.. నా బిడ్డకు తండ్రికి నువ్వే అని రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఈ మోనిత లో ఇప్పుడు పంతం పెరిగింది. మీ అమ్మని నీ భార్యని ఎలా తీసుకొస్తావో ఏమి చెప్పి ఒప్పిస్తావో నీ ఇష్టం రా వెళ్లదాం అంటుంది.
భాగ్యం దీప దగ్గరకు వెళ్తా అని చెబుతుంది. దీప ఇక్కడికి వస్తుందా నేను మారినట్లు అది గుర్తిస్తే చాలు అంటుంది.
కార్తీక్ ని ఇంటి దగ్గర దింపు .. కాబోయే పెళ్లికొడుకువు.. ముఖం కాస్త అందంగా ఉండాలి గా .. ఏమిటో నీ తలరాత.. అంటూ మీ ఇంటివరకూ తోడు రానా అంటే.. దీప నాలా సాప్ట్ కాదు.. అంబులెన్స్ లో పంపిస్తుంది అంటే.. దీప నన్ను ఏమీ అనదు.. అనేదే ఐతే.. ఇందాకా మనఇద్దరి మాటలు వారణాసి ఆటోలో కూర్చుని విన్నప్పుడే అనేది అంటుంది మోనిత . దీప కోపం నీ మీద నా మీద కాదు అని వెళ్ళిపోతుంది. కార్తీక్ . దీప ప్రవర్తన గురించి ఆలోచిస్తూ.. వస్తుంటే.. సౌందర్య ఎదురు వచ్చి.. ఏమైపోతున్నావురా అంటే.. పెద్దోడి నైపోయాను అంటాడు కార్తీక్.. భార్యకి, తల్లికి, కుటుంబానికి సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించలేనంత పెద్దోడినైపోయాను.. గాలికి ఎలా వీస్తే అలా కొట్టుకు పోయే చిత్తు కాగితాన్ని నా గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు.. ఈ విరక్తి ఏమిటి అన్న తల్లితో.. ఈ విరక్తి.. సన్యాసులకు.. విధివంచితుల చిత్తుకాగితాలు విరక్తి ఏమిటి.. వేళ్ళు మమ్మీ నీ ఆరోగ్యం జాగ్రత అంటే.. ఆ మోనిత ఇంటికి వచ్చి అని చెప్పబోతుంటే.. వస్తుంది ఎక్కడికైనా వస్తుంది ఏమైనా మాట్లాడుతుంది.. నాకు మీ చెప్పవద్దు ప్రశాంతంగా వేళ్ళు.. ఇంత ఫ్రస్టేషన్ లో ఉన్నాడంటే మోనిత ఎంత టార్చర్ పెడుతుందో అని ఆలోచిస్తుంది..
Also Read :