Karthika Deeepam Serial: ఓ వైపు దీప పిల్లల కోసం వెదుకుతున్న మోనిత… మరోవైపు మురళీకృష్ణ ఎవరికీ ముందు దీప ఆచూకీ లభిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈరోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది.
అన్నతో డాబా మీద ఆదిత్య మందు పార్టీ చేసుకుంటూ.. భార్యాభర్తల బంధం గురించి తనదైన శైలిలో హితబోధ చేస్తాడు.. ఈరోజు శ్రావ్య పుట్టిన రోజు అన్నయ్యా అని ఆదిత్య అనగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కార్తీక్.. సారీ గుర్తులేదు అంటాడు.. ఐతే నువ్వు శ్రావ్య మంచి ఫ్రెండ్లీగా ఉంటారు.. చాలా మంది భార్యలు ఇలా ఉండరు అంటాడు డాక్టర్ బాబు. నీకు అనుకూలంగా ఉండే భార్య దొరికింది అనగానే ఆదిత్య.. నవ్వుతు.. గతాన్ని చెబుతాడు.. ఇప్పుడు శ్రావ్య ఇలా ఉంది కానీ.. నిజానికి పెళ్లి అయినా కొత్తలో తన మనసులో నేను లేను.. వేరే వ్యక్తిని ప్రేమించింది. ఈ నిజం తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. ఎవరికీ చెప్పలేదు.. వాడు ఎవడో కూడా నాకు అవసరం లేదు.. నువ్వు ఇప్పుడు పదేళ్లుగా పడుతున్న నరకం.. నేను మొదట్లోనే పడ్డాను.. అమ్మానాన్నకి ఈ విషయం చెప్పలేదు.. కొడుకు జీవితం గురించి బాధపడతారని.. నాకు నేనే దైర్యం చెప్పుకున్నా.. శ్రావ్యని చాలా చాలా బాగా చూసుకున్నాను.. నా వైపు తిప్పుకుని నన్ను ప్రేమించేలా చేసుకున్నాను.. అంటాడు ఆదిత్య..
అయినా భార్యలందరూ మంచివాళ్ళే అన్నయ్య.. భర్తలు కూడా మంచివారే అనుకో.. నేను సర్దుకున్నా.. నువ్వు సర్దుకోలేదు.. అందుకే వదిన వెళ్ళిపోయింది అంటదు.. అంతేకాదు.. మోనిత కార్తీక ల మధ్య రిలేషన్ ను ఏ విధంగా అర్ధం చేసుకోవాలని అంటూ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య
అసలు వదిన వేరొకరిని ఇష్టపడితే.. ఈ పదేళ్లలో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు.. విహారి ఎందుకు తులసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..? వదినకు కవిత్వం అంటే ఇష్టం.. ఆ అభిమానం స్నేహం అయ్యింది. ఆ స్నేహాన్ని ఎలా అపార్దం చేసుకుంటావు.. సంస్కారం అది కాదు.. నిజానికి విశాల హృదయం అని మనం చెప్పుకోవడం కాదు. నిజంగా హృదయం తో మంచి చెడులు ఆలోచించాలి.. అంటూ ఆదిత్య చెప్పేమాటలకు కార్తీక్ కు దీప అన్న మాటలను పెట్టిన కన్నీరు గుర్తుకొస్తుంది.
నువ్వు వదిన్ని ఎన్నో సార్లు అనుమానించావు.. అవమానించావు.. మరి నువ్వు చేస్తున్నది ఏమిటి..? నీకు మోనిత కి ఉన్న రీలేషన్ ఏమిటి.? నిజానికి చెప్పాలంటే మీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు ఉంటారు.. కానీ ఎప్పుడైనా వదిన ఈ విషయం నీ దగ్గర మాట్లాడిందా.. మోనిత క్యారెక్టర్ నే తప్పు పట్టింది కానీ నిన్ను ఒక్కమాట కూడా అనలేదు.. మరి నీకో న్యాయం వదినకు ఒక న్యాయమా..? అని కార్తీక్ ని ప్రశ్నిస్తాడు.
మాట్లాడితే మోనిత ని పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అందరినీ బెదిరిస్తావ్.. మగాడినన్న అహంకారం తప్ప ఇంకేయందు.. నీ కడుపులో బిడ్డకు నేను తండ్రి కాను అప్పుడు వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.. పదేళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉంది.. అయితే నువ్వు అనుమానించినట్లు వదిన మనసులో ఇంకొకరు ఉంటె.. పిల్లల్ని కనేది కాదు.. ఇన్ని కష్టాలుపడుతూ.. పెంచేది కాదు.. నువ్వు అవమానించినా దీప నేను ఇంటికి వస్తాను అని అంటే.. అమ్మ వద్దంటుందా. నాన్న కాదంటాడా.. నేను శ్రావ్య అడ్డు పెడతామా.. అయినా నాన్న ఆస్థి ఇస్తానన్నా తీసుకుందా.. ? అసలు వదిన ఎక్కడా తన ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు.. తిండి లేకపోయినా కష్టపడి పిల్లని పెంచుకుంటుంది. నీ మాటలకూ ఎంత బాధపడిందో.. పిల్లని తీసుకుని ఊరువదిలి వెళ్ళిపోయింది..
మరి నువ్వు మోనిత తో అంత క్లోజ్ గా ఉంటావు కదా.. మోనిత ఎవరైనా డాక్టర్ తో మాట్లాడితే వాడు ఎవరు అని ఎప్పుడైనా అడిగావా..? లేదు ఎందుకంటే నీకు మోనిత అంటే నమ్మకం.. అదే నమ్మకం వదిన మీద ఎందుకు లేదు.. ఎందుకంటే మోనిత ఎక్కువ చదువుకుంది అనుకుంటావ్.. సోషల్ గా ఉంటుంది అని అనుకుంటావు.. మరి మోనిత.. వదిన ఇద్దరూ ఆడవారే ఎందుకు తేడా..? అలోచించు బాగా అలోచించి.. వదిన కోసం.. పిల్లల కోసం అంటూ ఆదిత్య కార్తీక్ కు హితబోధ చేస్తాడు.. ఇంతలో శ్రావ్య ఆదిత్య, కార్తీక్ ని భోజనానికి పిలుస్తుంది.
మరోవైపు దీప కు మళ్ళీ దగ్గు మొదలవుతుంది.. పిల్లలు కంగారు పడతారు.. శౌర్య మళ్ళీ నీకు దగ్గు వస్తే.. డాక్టర్ బాబు హాస్పటల్ కి చూపించుకోమన్నారుకదా పద వెళదాం ఆస్పత్రికి అంటుంది.. వద్దు ఇది మామూలు దగ్గే అంటుంది.. అయినా పిల్లలు వినకుండా మందుల షాపుకి వెళ్లారు. .
ఇంతలో మురళీ కృష్ణ దీప కోసం వెదుకుతుంటాడు.. దీప పిల్లల్తో ఎన్ని అవస్థలు పడుతున్నావు అని బాధపడుతుంటారు.
మా అమ్మకి దగ్గు బాగా వస్తుంది… టానిక్,మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పి అవి తీసుకుని వారణాసి ఆటోలో మళ్ళీ తిరిగి బయలుదేరతారు.. అయితే మెడికల్ షాల్ లో ఉన్న మరో వ్యక్తి దగ్గర హిమ, శౌర్య ఫోటోలు ఉంటాయి.. వీరిద్దరి గురించి ఆచూకీ చెబితే రూ. 25,000 ఇస్తారట.. కొత్తఫోన్ కొనుకోవచ్చు అంటాడు.. ఆ ఫోటోలను చూసిన మెడికల్ షాప్ అబ్బాయి నేను ఇప్పుడే వాళ్ళకి మందులు ఇచ్చా అని చెబుతాడు.. ఇద్దరూ ఆటోని వెంబడిస్తారు.
ఇంతలో కార్తీక్ కు తాను దీపని పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషంగా గడిపిన రోజులను .. సౌందర్య దీప గురించి ప్రాధేయపడిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు.. మరి రేపటి ఎపిసోడ్ లో దీప ని మురళీ కృష్ణ పట్టుకుంటాడా.. లేక ఆ మెడికల్ షాప్ వాళ్ళకి దొరికి మోనిత కి ఆచూకీ దొరుకుతుందా .. చూడాలి మరి
Also Read: లెజెండరీ హీరో శశికపూర్ జయంతి నేడు.. శశికపూర్, జెన్నిఫర్ల అందమైన ప్రేమకావ్యం మీకు తెలుసా..