Karthika Deepam: కార్తీక దీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. వీడియో షేర్ చేసిన ఉషా రాణి

|

Jun 16, 2024 | 7:30 AM

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి 'మీరు నాలా మోసపోకండి' అని హెచ్చరించింది

Karthika Deepam: కార్తీక దీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి.. వీడియో షేర్ చేసిన ఉషా రాణి
Karthika Deepam Serial Artist
Follow us on

 

బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిందీ ధారావాహిక. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం 2 సీరియల్ కూడా వస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తోన్న ఒక నటికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు. కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు, నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి ‘మీరు నాలా మోసపోకండి’ అని హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. కార్తీకదీపం 2లో కీలక పాత్రలో నటిస్తోంది నటి ఉషారాణి. దీపకు అత్త క్యారెక్టర్ చేస్తుందామె. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసిందామె. అందులో ఇలా చెప్పుకొచ్చింది.’ నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. దానిని నా కుమారుడు బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ కార్డులో మొత్తం రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది. అయితే మా అబ్బాయి తరచూ కార్డులను ప్యాంటు జేబులో పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశాను. పైగా ఆ కార్డు నాకు కావాల్సిన ఆన్ లైన్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్ కి లింక్ అయి ఉండటంతో పని అయితే జరుగుతోంది కదా అని లైట్ తీసుకున్నాను’

ఇవి కూడా చదవండి

‘కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో ‘నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది. ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని షేర్ చేయండి అని అడిగాడు. అయితే నేను కాసేపు ఆలోచించాను.
ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను. దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను’ అని వీడియోలో చెప్పుకొచ్చింది ఉషారాణి. ఈ సందర్భంగా ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిమానులు, ఫ్యాన్స్ ను సూచించిందామె. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నటి షేర్ చేసిన వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.