karthika deepam serial: తెలుగు తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1000 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది. కార్తీక్ దీప పిల్లలు ఉన్న ఊరుకి చేరుకుంటారు.. మరి ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో చూద్దాం..
మా అమ్మ ఎప్పుడు మా నాన్నని గానీ ఎవరినీ గానీ ఏమీ అనదు కదా.. అలాంటి మంచి అమ్మ మా నాన్నకు ఎందుకు నచ్చడం లేదు.., నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.. వాళ్ళు మంచివాళ్ళే…. మా అమ్మ మంచిదే.. అయినా మా అమ్మ ఆ ఇంట్లో ఎందుకు ఉండకూడదు.. అంటూ దీపని,, మురళీ కృష్ణని నిలదీస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు.. ఆలస్యం అయింది అమ్మని నిద్రపోనీయమ్మ అంటాడు మురళీ కృష్ణ.. మనం చూసినప్పుడు అమ్మ నిద్రపోతుంది తాతయ్య.. కానీ ఎప్పడూ నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. సడెన్ గా లేచి కూర్చుని మమ్మల్ని ఎవరో ఎత్తుకుపోతున్నట్లు లేచి కూర్చుని పిలుస్తూ ఉంటుంది. పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటుంది.. దీంతో హిమా ఆర్తిగా అమ్మా అంటూ మేము ఎక్కడికి వెళ్ళం.. నాన్న వచ్చి రమ్మన్నా వెళ్ళం.. నువ్వు భయపడకమ్మా పడుకో.. అంటుంది హిమ..
మరోవైపు మోనిత .. భాగ్యం చెప్పిన విషయాన్నీ గుర్తు చేసుకుని.. మురళి కృష్ణ దీపని తీసుకుని రాలేదు.. ఎవరికీ అడ్రస్ కూడా చెప్పలేదు.. ఎందుకు చెప్పలేదు.. ఆ దీప వద్దని ఉంటుందా .. లేక రానని ఉంటుందా .. అంటూ తనలో తానే ఆలోచిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా… దీప వెనక్కి తిరిగి రాకపోతే నాకంటే సంతోషించేవారు ఎవరూ లేరు.. అనుకుంటూ కార్తీక్ ఏమయ్యాడు.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు ఎం చేయాలి నేను ఆలోచిస్తుంది..
తెల్లవారిన తర్వాత దీపని శౌర్య నిద్రలేపి కాఫీ ఇస్తుంది. వారాణసి బండి దగ్గర కల్పిచ్చాడు చెప్పింది. హిమ గురించి అడిగితె.. బండి దగ్గర తాతయ్యతో కలిసి వెళ్ళింది. మీ ఇద్దరినీ వద్దు అన్నాను కదా.. అక్కడ ముగ్గురు ఉన్నారు. కానీ మరో ముగ్గురు ఉన్నా అక్కడ సరిపోరు అంటూ వాదిస్తుంది. నిన్న ఒప్పుకున్నావు కదా అని అడుగుతుంది శౌర్య. మిమ్మల్ని కష్టపెట్టడానికా ఇక్కడికి తీసుకొచ్చింది.. అంటుంది దీప.. మేము డబ్బులు లెక్కపెట్టి తీసుకోవడం కూడా కష్టమేనా అంటుంది శౌర్య. ఒకసారి మీతో నీరు మోయించినందుకే మీ నాన్నా చెంపమీద కొట్టారు అని గుర్తు చేసుకుంటుంది దీప. దీంతో శౌర్య ఇప్పుడు నాన్నా లేదుగా అని అంటుంది. మీ నాన్నా ఉన్నా లేకపోయినా ఆయనకి నచ్చని పనులు మనం ఎప్పుడూ చేయకూడదు అని దీప శౌర్యకి చెబుతుంది.
కార్తీక్ దీప పిల్లల దగ్గరకు వస్తూ.. దారిలో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ తింటూ.. శౌర్యాని గుర్తు చేసుకుంటాడు. ఇంతలో సౌందర్య కార్తీక్ కి ఫోన్ చేస్తుంది.. ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది.. నీ నచ్చని చోటు.. అంటాడు అంటే మోనిత ఇంట్లోనా అంటుంది సౌందర్య.. అది నాకు నచ్చిన చోటు అంటాడు కార్తీక్.. చెప్పారా ఎక్కడ ఉన్నావు.. రాత్రి అంతా ఇంటిరాకపోతే.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే.. మనలో మనకు అభిప్రాయ బేధాలు ఉండి ఉంటె.. మాటకు మాట అనుకుంటాం.. కానీ ఎప్పటికీ నేను అమ్మనేరా… నువ్వు నా కొడుకువి.. అంటే.. నాకు ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా..? పోనీ ఏమైనా తిన్నావా అదైనా చెప్పు.. అంటుంది.. తింటున్నాను వేళ్ళు నాకి మరీ తింటున్నా.. నేను నీకోడల్లా చెప్పా పెట్టకుండా వెళ్ళలేదు .. అని అంటే.. నా కోడలు మాత్రమేనా వెళ్ళింది.. నువ్వు కూడా రికార్డ్ వీడియో పంపించింది ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోలేదా అని కార్తీక్ కి సౌందర్య గతం గుర్తు చేస్తుంది. తాను ఇంపార్టెంట్ పని మీద వచ్చాను.. అది పూర్తి చేసుకోగానే వచ్చేస్తాలే అని అంటాడు కార్తీక్.
సౌందర్య ఇంట్లో ఆలోచిస్తుంటే.. ఆనందరావు మన ఇంట్లో ఏ టెన్షన్ మొదలైంది.. చెప్పు అంటాడు. కార్తీక్ కి ఫోన్ చేసిన విషయం గురించి చెబుతుంది సౌందర్య.. అంతేకాదు అది వాడికి సంబంధించిందా..? దీపకు సంబంధించిందా..? లేక మోనిత కు సంబంధించిందా అని ఆలోచిస్తుంది.. ఇంతలో మోనిత నమస్తే ఆంటీ అంటూ ఇంట్లో అడుగు పెడుతుంది.. వెంటనే సౌందర్య పాపి చిరాయువు అంటే ఇదేనేమో అంటుంది.. మోనిత నేను మీతో గొడవపడడానికి రాలేదు.. కార్తీక్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఇంట్లో ఉన్నదా అని కనుకోవడానికి వచ్చా అంటుంది.. వెంటనే ఆనందరావు స్పందిస్తూ.. ఇంటిలో మాత్రం లేడు .. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం.. నీకు కూడా తెలియదా..? అంటాడు . అంటే వెళ్లి రమ్మన్నా అంకుల్.. మంచిది.. మోనిత ఏదైనా త్వరగా గ్రహిస్తుంది అంటాడు ఆనందరావు.. మోనిత కొత్త యాంగిల్ గురించి ఆలోచిస్తూ.. కొంపదీసి దేనికి హిమగాని దొరకలేదు కదా అని ఆలోచిస్తుంది సౌందర్య.
ఇక నాన్న టిఫిన్ సెంటర్ దగ్గర తాతయ్య మురళీ కృష్ణ తో కలిసి హిమ సర్వీస్ చేస్తుంటుంది. హిమనీ వారణాసి వద్దు అంటే.. హిమ వినదు. దీప ఇడ్లి సెంటర్ దగ్గరకు బయలు దేరుతుంది.. శౌర్య వారిస్తుంది.. ఇంతలో హిమ ఓ కస్టమర్ కు చెట్నీ వేయడానికి వెళ్తుంటే.. కార్తీక్ చేయి పట్టుకుని ఆపుతాడు.
దీప దగ్గుతూ.. లేచి నిల్చుని.. అద్దంలోకి చూసి.. పాపిట సిందూరం దిద్దుకుంటుంటే.. శౌర్య విసుగుకుంటే.. దీప శౌర్యని పని ఎక్కువ అయితే పక్కన పెట్టు.. ఆ విసుగు నామీద చూపించకు అత్తమ్మా అంటుంది.. ఈ కుంకుమ పెట్టుకుంటే.. మీ నాన్నా నాపక్కన ఉన్నట్లు ఉంటుంది అంటూ దీప కన్నీరు పెట్టుకుంటుంది.. ఇక అదే సమయంలో హిమ తండ్రి కార్తీక్ ని చూసి.. కన్నీరు పెట్టుకుంటుంది.. హిమ చేతి నుంచి చెట్నీ గిన్నెను తీసుకుని తాను వడ్డిస్తాడు.
టిఫిన్ సెంటర్ దగ్గర కార్తీక్ ని చూసిన హిమతో పాటు.. మురళీ కృష్ణ వారణాసి షాక్ తింటారు. మరి కార్తీక్ పిల్లలల్ని మాత్రమే ఇంటికి తీసుకొస్తాడా..? లేక దీప ని కూడా తీసుకుని వస్తాడా..? దీప నిర్ణయం ఏమిటి తెలియాలంటే.. రేపటివరకూ ఆగాల్సిందే..!
Also Read : ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..
ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా..! చాలా పేస్ట్‌లు వాడి బోర్ కొట్టిందా.. అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి..