Karthika Deepam 2: వంటలక్క, డాక్టర్ బాబు ఈజ్ బ్యాక్.. కానీ ఈసారి కథ వేరుంటది.. కార్తీక దీపం 2 కొత్త ప్రోమో చూశారా ?.

|

Feb 25, 2024 | 2:29 PM

ఇటీవలే 'కార్తీక దీపం ఇది నవవసంతం' అంటూ సీక్వెల్ ప్రోమో వదిలారు మేకర్స్. ఈ సూపర్ హిట్ ధారవాహికకు కొనసాగింపుగా వస్తుందని అధికారికంగా చెప్పేశారు. కానీ ఇందులో మునుపటి పాత్రలు ఉంటాయా ? అనే సందేహాలను కలిగించారు. కొద్ది రోజుల క్రితం రివీల్ చేసిన ప్రోమోలో శౌర్య పాత్ర తన అమ్మనాన్న కథను చెబుతున్నట్లు తెలిపారు. దీంతో ఈసారి వంటలక్క, డాక్టర్ బాబు మళ్లీ కనిపిస్తారా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు అడియన్స్. తాజాగా ప్రేక్షకుల సందేహాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Karthika Deepam 2: వంటలక్క, డాక్టర్ బాబు ఈజ్ బ్యాక్.. కానీ ఈసారి కథ వేరుంటది.. కార్తీక దీపం 2 కొత్త ప్రోమో చూశారా ?.
Karthika Deepam 2 Promo
Follow us on

దాదాపు ఏడేళ్లు తెలుగు ప్రేక్షకులకు టీవీలకు అతుక్కునేలా చేసిన సీరియల్ కార్తీక దీపం. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా ఈ సీరియల్‏కు అభిమానులయ్యారు. ఈ సీరియల్ కంటే.. అందులోని పాత్రలకే జనాలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితా.. ఈ మూడు పాత్రలు సీరియల్ కు ప్రధానం కాగా.. అడియన్స్ హృదయాలకు ఎక్కువగా దగ్గరైన పాత్రలు డాక్టర్ బాబు, వంటలక్క. కొన్నేళ్లపాటు బుల్లితెరపై చక్రం తిప్పిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్లీ రాబోతుంది. ఇటీవలే ‘కార్తీక దీపం ఇది నవవసంతం’ అంటూ సీక్వెల్ ప్రోమో వదిలారు మేకర్స్. ఈ సూపర్ హిట్ ధారవాహికకు కొనసాగింపుగా వస్తుందని అధికారికంగా చెప్పేశారు. కానీ ఇందులో మునుపటి పాత్రలు ఉంటాయా ? అనే సందేహాలను కలిగించారు. కొద్ది రోజుల క్రితం రివీల్ చేసిన ప్రోమోలో శౌర్య పాత్ర తన అమ్మనాన్న కథను చెబుతున్నట్లు తెలిపారు. దీంతో ఈసారి వంటలక్క, డాక్టర్ బాబు మళ్లీ కనిపిస్తారా ? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు అడియన్స్. తాజాగా ప్రేక్షకుల సందేహాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం కార్తీక దీపం 2 నుంచి మరో కొత్త ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల.. వంటలక్కగా ప్రేమీ విశ్వనాద్ కనిపించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క భార్య భర్తలు.. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం నిరుపమ్ వద్ద వంటమనిషిలా పనిచేస్తుంది దీప. తండ్రి కోసం ఎదురుచూస్తున్న కూతురిగా.. తల్లి పై అంతులేని ప్రేమను చూపిస్తూ.. తల్లిలోనూ తండ్రిని చూసుకుంటూ కనిపిస్తుంది శౌర్య. అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమో చూస్తుంటే కార్తీక దీపం ఫస్ట్ పార్టుకు ఇప్పుడొచ్చే సకెండ్ పార్ట్ అసలు కనెక్షన్ లేకుండా.. ఈసారి నేపథ్యం కొత్తగా ఉండనుందని అర్థమవుతుంది. అయితే దీప భర్త ఎవరు ?.. నిరుపమ్ ఇంట్లో వంటమనిషిలా ఎందుకు ఉంది ? అనే కొత్త సందేహాలు మాత్రం ప్రేక్షకులకు రావడం ఖాయం. ఈసారి కార్తీక దీపం నవ వసంతంతో జనాలకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తారో చూడాలి.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మోనితా, సౌందర్య, హిమ పాత్రల గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. కేవలం వంటలక్క, డాక్టర్ బాబు, శౌర్య పాత్రలను మాత్రమే రివీల్ చేశారు. దీంతో ఇందులో మోనితా మళ్లీ కనిపిస్తుందా ? లేదా?.. అనేది చూడాలి. కొత్త వెలుగులతో.. తెలుగు లోగిళ్లు మరువని కథ.. కార్తీక దీపం 2 త్వరలోనే రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.