Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. శోక సంద్రంలో సినిమా ఇండస్ట్రీ.. ఏం జరిగిందంటే?

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీరియల్ హీరోయిన్ అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం నటి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. కాగా నటి మరణ వార్త తెలుసుకున్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Nandini: ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. శోక సంద్రంలో సినిమా ఇండస్ట్రీ.. ఏం జరిగిందంటే?
Actress Nandini

Updated on: Dec 29, 2025 | 8:35 PM

కన్నడ, తమిళ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు కానీ.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని తన ఇంటిలోనే నటి బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. ప్రస్తుతం ఈ మరణ వార్త కన్నడ, తమిళ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నటి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. కాా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని తెలుగులో కాకుండా కన్నడ, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన ‘గౌరి’ సీరియల్ నందినీకి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది. అలాగే కన్నడ సీరియల్స్ ‘జీవా హూవాగే’, ‘నీనాదే నా’, ‘సంఘర్ష’, ‘మధుమగల్’ లలో ఆమె నటనకు బుల్లితెర ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. సీరియల్స్ లో ఆమె పోషించిన దుర్గ, కనక పాత్రలు బాగా ఫేమస్ అయ్యాయి.

కాగా గౌరీ గత కొన్ని రోజులుగా బెంగళూరులో ఉంటోంది. ఒక పీజీలో ఉంటూ సీరియల్స్ షూటింగ్ కు హాజరవుతోంది. అయితే ఇప్పుడు ఆమె తన తల్లికి డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి నటి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. నందిని మరణ వార్తను తెలుసుకుని ‘గౌరి’ సీరియల్ బృందం షాక్ అయ్యారు. సన్నిహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు నందినికి నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల నివాళులు..

 

గౌరీకి ప్రస్తుతం సీరియల్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.