TV Serial-Jr. NTR: ప్రస్తుతం.. వెండి తెర, బుల్లి తెర అనే తేడా లేదు.. వెండి తెరపై ఫేమస్ అయిన వారు టీవీ షోస్, సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్నారు. స్మాల్ స్క్రీన్ పై అడుగు పెట్టిన వారు.. కాలక్రమంలో సినిమాల్లో అడుగు పెట్టి.. ఫేమస్ అయినవారున్నారు. మొదటి దర్శకుడిగా సీరియల్ తో అడుగు పెట్టి.. శాంతినివాసం సీరియల్ తో ఫేమస్ ఐన రాజమౌళి మెగా ఫోన్ పట్టుకుని స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో వెండి తెరపై డైరెక్టర్ గా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే నందమూరి మూడో తరం నట వారసుడు ఎన్టీఆర్ కూడా ఓ సీరియల్ లో నటించిన సంగతి తెలుసా..!
స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు జూ. ఎన్టీఆర్ బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బలరామాయణం వంటి సినిమాల్లో నటించాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగ వంటి వరస సినిమా హిట్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మల్టీస్టార్ చేస్తున్న ఎన్టీఆర్.. మరోవైపు బుల్లి తెరపై ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. అయితే చాలా మంది అభిమానులకు ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా చేస్తున్న ఎన్టీఆర్ మాత్రమే తెలుసు.. కానీ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడనే విషయం బహుశా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఇంతకీ ఎన్టీఆర్ నటించిన సీరియల్ ఏంటి? ఏ ఛానల్ లో ఆ సీరియల్లో టెలికాస్ట్ అయ్యేది అనే వివరాల్లోకి వెళ్తే..
ఈ టీవీ లో ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ ప్రసారమయ్యేది. ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు. ఎన్టీఆర్ శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు.
Also Read: లెబనాన్‌లో ఘోర ప్రమాదం, ఇంధన ట్యాంకర్ పేలి 20 మృతి.. కొనసాగుతున్న సహక చర్యలు