జగ్గూ భాయ్ హోస్ట్‌గా, కింగ్ నాగార్జున గెస్టుగా.. టీవీలో సరికొత్త సెలబ్రిటీ టాక్ షో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో అలరించిన జగపతి బాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తోన్న మొదటి టీవీ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి త్వరలోనే టెలికాస్ట్ కానుంది.

జగ్గూ భాయ్ హోస్ట్‌గా, కింగ్ నాగార్జున గెస్టుగా.. టీవీలో సరికొత్త సెలబ్రిటీ టాక్ షో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
Jayammu Nischayammu Raa TV Show

Updated on: Aug 13, 2025 | 8:55 AM

నిరంతరం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్టుగా జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి, ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం, మీ జీ తెలుగులో!
బుల్లితెరపై మొదటిసారిగా నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారి తనదైన స్టైల్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. తెలుగు సినిమాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్న జగపతి బాబు జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఘనంగా ప్రారంభం కానున్న జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి లాంచ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి అతిథిగా రానున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో నాగార్జున తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంగతులతోపాటు సూపర్ హిట్ సినిమాల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్తో తన అనుబంధం వరకు మరెన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు.

 

అంతేకాదు, ఈ ఎపిసోడ్‌లో అక్కినేని కుటుంబం ప్రముఖ వ్యక్తులు ముఖ్యఅతిథులుగా హాజరై నాగార్జున గురించి మరిన్ని సంగతులను చెప్పడమే కాదు, భావోద్వేగంతో కూడిన మరపురాని క్షణాలను ఆస్వాదించనున్నారు. జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి కేవలం ఒక టాక్ షో మాత్రమే కాదు, తమ నటనతో తెరపై ప్రేక్షకులకు వినోదం పంచే సినీ ప్రముఖుల జీవితాల్లోని ఒడిదొడుకులు, ఆనందాలు, కష్టసుఖాలు, జ్ఞాపకాలను పంచుకునే స్ఫూర్తిదాయకమైన వేదిక. ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి అంటూ గెస్ట్లతో కలిసి జగపతి బాబు పంచే వినోదాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి! కింగ్ నాగార్జున పంచుకునే విశేషాలేంటో తెలుసుకునేందుకు మీరు రెడీనా?.. జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి, ఆగస్టు 15 న జీ5 లో మరియు ఆగస్టు 17 న ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో!

ఇవి కూడా చదవండి

జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.