
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఈ షో ద్వారా పాపులర్ అయ్యారు. అందులో రాజమౌళి ఒకరు. ఈ పేరు కంటే జబర్దస్త్ రాజమౌళి చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు. తన హాస్య పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, ఇటీవల సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ నుండి విరామం తీసుకున్నారు. ఆయన లక్ష్యం ఎప్పుడూ వెండితెరపై కనిపించడమేనని తెలిపారు. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలలో నటిస్తున్నారు. సినిమాలలో కేవలం కామెయో రోల్స్ కాకుండా, పూర్తి నిడివి గల పాత్రలు పోషిస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు. సినిమాలలో అవకాశాలు ఎక్కువగా రావడం వల్లే బ్రేక్ తీసుకున్నానని, జబర్దస్త్ టీం గానీ, తాను గానీ ఒకరినొకరు విడిచిపెట్టలేదని స్పష్టం చేశారు. తన ప్రధాన లక్ష్యం వెండితెరపై నటుడిగా నిలదొక్కుకోవడమేనని అన్నారు.
తన మొదటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ నాల్గవ తరగతిలో జంగిల్ గూడెం గ్రామంలోని స్కూల్‌లో జరిగిందని, ఆ తర్వాత డిగ్రీలో NSS క్యాంపులలో కూడా ప్రదర్శనలు ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలోనే తన తండ్రి కళాకారుడని, ఆయన నాటకాలు వేసేవారని తెలిపారు. తన తండ్రి తాను సినీరంగంలోకి రాకముందే చనిపోయారని, తన పేరు రాజమౌళి అని తన తల్లిదండ్రులు పెట్టారని, ఎస్.ఎస్. రాజమౌళి గారు ఫేమస్ అయిన తర్వాత పెట్టుకున్న పేరు కాదని స్పష్టం చేశారు. కరోనా సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురై, కూకట్‌పల్లిలోని పద్మజ హాస్పిటల్‌లో చేరి మృత్యు అంచుల దాకా వెళ్లి వచ్చానని, అది తనకు చాలా భయంకరమైన అనుభవమని వివరించారు. డాక్టర్లు, తన అభిమానుల ఆశీస్సుల వల్లనే మళ్లీ బ్రతకగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. భోలే సార్, ఎలందర్, బలగం వేణు వంటి వారు తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పడ్డారని పేర్కొన్నారు. 2014లో బలగం వేణు టీమ్ ద్వారా జబర్దస్త్‌లో తన ప్రయాణం మొదలైందని, ఆ తర్వాత ఆర్.పి. బుల్లెట్ భాస్కర్ టీమ్‌లతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
జబర్దస్త్ షోలో ముందు 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదని.. వేణు అన్న మొదటిసారి పదివేల చెక్ ఇవ్వడంతో సంతోషానికి అవధులు లేవని అన్నారు. తెలంగాణ కళాకారులకు తెలంగాణ సాంసృతిక శాఖలో కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు.. తనకు కూడా ఉద్యోగం వచ్చిందని తెలిపారు. రసమయి బాలకిషన్ అప్పుడు చైర్మన్ అని.. కళాకారులు టీవీ, సినిమాల్లో చేయొద్దు అని ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు చెప్పారని.. దీంతో జబర్దస్త్ షోకు దూరమయ్యాయని అన్నారు. ఆ త్రవాత రసమయి గారిని కలిసి జబర్దస్త్ చేస్తానని రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకున్నారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..