Jabardasth: చదువుతో సంబంధం లేకుండా ప్రతిభతో లక్షల్లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా..

|

Sep 14, 2021 | 12:28 PM

Jabardasth Comedians: బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయం అయ్యారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు..

Jabardasth: చదువుతో సంబంధం లేకుండా ప్రతిభతో లక్షల్లో సంపాదిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా..
Jabardasth Show
Follow us on

Jabardasth Comedians: బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయం అయ్యారు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వెండి తెరపై కూడా తమదైన శైలిలో నటిస్తూ పలు అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ షోలో నటించే కమెడియన్స్ లో కొంతమంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినవారున్నారు.. మరికొందరు చదువుని మధ్యలో మానేసినవారున్నారు. వీరిలో ఎక్కువమంది ఒకానొక సమయంలో రూమ్ కి రెంట్ కట్టడానికి డబ్బులు లేకుండా ఇబ్బందిపడినవారే . కష్టనష్టాలకు ఓర్చుకుని తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఈ కామెడియన్స్ గా షోలద్వారా, వివిధ కార్యక్రమాలతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. చమ్మక్ చంద్ర వంటి వారు ఏకంగా కోట్లు విలువే ఆస్తులను సంపాదించుకున్నారు.. అయితే ఈరోజు ఈ కామెడియన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మధ్యలో ఎందుకు మానేశారో తెలుసుకుందాం..

జబర్దస్త్ షో , ఎక్స్ ట్రా జబర్దస్త్  షోలతో యాంకర్స్ గా  మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు అనసూయ, రష్మీ గౌతమ్ లు.  బుల్లి తెరనుంచి వెండి తెరపై కూడా అడుగు పెట్టి అక్కడ కూడా తమదైన  ముద్రతో కెరీర్ లో సాగుతున్నారు. అనసూయ ఎంబీఏ పూర్తి చేశారు. ఇక రష్మి గౌతమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.

జబర్దస్త్ షో తో హైపర్ ఆదిగా మారిన ఆది.. బిటెక్ చదుకున్నాడు.. కొన్నాళ్ళు సాప్ట్ వేర్ గా కూడా ఉద్యోగం చేశాడు. అదిరే అభి బీటెక్ చదువుకున్నాడు.  ముక్కు అవినాష్ ఎంబీఏ పూర్తి చేశాడు .సుడిగాలి సుదీర్ ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక రాకెట్ రాఘవ డిగ్రీ కంప్లీట్ అయ్యాక టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యాడు. జబర్దస్త్ లో అడుగు పెట్టి.. రంగస్థలం సినిమాతో రగస్థలం మహేష్ గా ఫేమస్ అయిన ఆచంట మహేష్ బీకాం పూర్తి  చేశాడు. బుల్లెట్ భాస్కర్ బీకాం చదువుకున్నాడు. ఇక అదుర్స్ ఆనంద్ ఎంసీఏ డిస్ కంటిన్యూ చేయగా కెవ్వుకార్తిక్ డిగ్రీ పూర్తి చేశాడు.

ఇక గెటప్ శీను ఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ చేయగా  ఆటో రాంప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. చలాకి చంటి డిగ్రీ డిస్కంటిన్యూ చేయగా..  చమ్మక్ చంద్ర ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. నాటి నరేష్ డిగ్రీ డిస్ కంటిన్యూ  చేయగా.. తాగుబోతు రమేష్ మాత్రం స్కూల్ స్టడీస్ తో చదువుకు గుడ్ బై  చెప్పేశాడు.

ఇలా జబర్దస్త్ కమెడియన్స్ చదువుతో సంబంధం లేకుండా తమ ప్రతిభతో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమదైన శైలితో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Also Read:   బాలయ్య నరసింహనాయుడు సినిమాలో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా