Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. షాక్‌‌‌లో ఫ్యాన్స్.. ఆ అమ్మాయి ఎవరంటే..

|

Mar 04, 2022 | 3:39 PM

ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. షాక్‌‌‌లో ఫ్యాన్స్.. ఆ అమ్మాయి ఎవరంటే..
Sudigali Sudheer
Follow us on

Sudigali Sudheer: ప్రముఖ టీవీఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వీరిలో కొంతమంది హీరోలుగాను మారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. మ్యాజిక్ షోస్‌తో కెరీర్ ఆరంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్. అయితే కమెడియన్ గా, పలు టీవీషోలకు యాంకర్ గానూ రాణిస్తున్న సుధీర్.. తన కో యాంకర్ రష్మీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నాడని.. ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఈ వార్తలను అటు సుధీర్ కానీ.. ఇటు రష్మీ కానీ సీరియస్ గా తీసుకోలేదు.. కొన్ని టీవీ షోస్ లో ఈ ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అయితే అదంతా అబద్దపు పెళ్లే అయినప్పటికీ సుధీర్ , రష్మీ ఫ్యాన్స్ కు మాత్రం కనువిందుగా అనిపించింది.

తాజాగా సుధీర్ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ వీడియోలో సుధీర్ కు ఓ అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ఉంది. దాంతో సుధీర్ అభిమానులంతా షాక్ అవుతున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరు.? అనే దానిపై ఇప్పుడు అతడి అభిమానులు అన్వేషిస్తున్నారు. నిజంగానే సుధీర్ కు ఎంగేజ్‌మెంట్ అయ్యిందా..? ఆ అమ్మాయితో సీక్రెట్ లవ్ ట్రాక్ నడిపాడా.? అని ఆరా తీస్తున్నారు అతడి ఫ్యాన్స్. ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదని, ఇంతకి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయేనా? అని చర్చించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు. తను ఒక మోడల్‌.. కొన్నియాడ్స్‌లో కూడా నటించిందట.. ఇప్పుడు సుధీర్ ఎంగేజ్‌మెంట్ నిజామా లేక ఫేకా అనేది తెలుసుకునేందుకు సుధీర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎంగేజ్‌మెంట్ ఓ టీవీ షో కోసం జరిగిందని.. ఇదంతా అబద్దపు ఎంగేజ్‌మెంట్ అని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kriti Sanon: చీర కట్టు అందాలతో కేక పెట్టిస్తోన్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటోస్

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..