Ileana D’Cruz: ప్రెగ్నెసీ పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా.. అసలు విషయం బయటపెట్టిన గోవా బ్యూటీ..

|

May 05, 2021 | 1:45 PM

ఇలియానా ఒకప్పుడు ఈ పేరంటే కుర్రకారు పడిచచ్చిపోయేవారు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆతర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. 

Ileana DCruz: ప్రెగ్నెసీ పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా.. అసలు విషయం బయటపెట్టిన గోవా బ్యూటీ..
ఆతర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మంచి కథ దొరికితే తిరిగి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తుంది ఇల్లీబేబీ. 
Follow us on

Ileana D’Cruz:

ఇలియానా ఒకప్పుడు ఈ పేరంటే కుర్రకారు పడిచచ్చిపోయేవారు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆతర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది.  తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్  మారిపోయింది ఇలియానా . తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యలో ఈ బ్యూటీకి అస్సలు ఛాన్సులు రావడం లేదు. దీంతో ఈ గోవా బ్యూటీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆతర్వాత ఆమె బరువు పెరగడం,ప్రేమ విఫలం అవ్వడం ఇలా వరుసగా జరగడంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఆతర్వాత కోలుకొని పాత ఇలియానాలా మారింది. లావుగా ఉన్న సమయంలో తెలుగులో రీ ఎంట్రీ ఇద్దామనుకున్న ఆ ప్లాన్ బెడిసికొట్టింది. రవితేజతో నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. అయితే సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తాను ప్రేమలో ఉన్నప్పటి ఆసక్తికరవిషయాలను చెప్పుకొచ్చింది.  ‘‘గత కొన్ని సంవత్సరాల క్రితం ఆండ్రూ అనే వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  కొన్ని వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతో మేమిద్దరం 2019లో విడిపోయాం. అయితే, మేమిద్దరం రిలేషన్‌లో ఉన్న సమయంలో నేను గర్భం దాల్చానని, అలాగే అబార్షన్‌ చేయించుకున్నానని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ అబద్ధం. ఆ వార్తలు కేవలం అవాస్తవాలు మాత్రమే’’ అంటూ క్లారిటీ ఇచ్చింది.  ఇలియానా ఆత్మహత్యకు పాల్పడిందని, తన పని మనిషి ఆసమయంలో ఆమెను కాపాడింది కూడా వార్తలు వినిపించాయి. వాటి పైకూడా ఇలియానా వివరణ ఇచ్చింది. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని.. అసలు తనకు పనిమనిషి ఎవరు లేరని చెప్పుకొచ్చింది ఇలియానా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Lucky Ali: అలీ మరణించలేదు.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మకండి

Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..