Tollywood: ఈ ఫోటోలోని కుర్రాడు ఇప్పుడు బుల్లితెర సూపర్ స్టార్.. అమ్మాయిల మనసు దొచిన కృష్ణుడు.. గుర్తుపట్టండి..

|

Apr 07, 2023 | 6:08 PM

ఈ చిన్నోడు నటిస్తోన్న సీరియల్ టీఆర్పీలోనూ టాప్‏లో ఉండడం విశేషం. అందంలోనే కాదు.. నటనతోనే ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ఇతడికి అమ్మాయిల ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పుకొవాలి.

Tollywood: ఈ ఫోటోలోని కుర్రాడు ఇప్పుడు బుల్లితెర సూపర్ స్టార్.. అమ్మాయిల మనసు దొచిన కృష్ణుడు.. గుర్తుపట్టండి..
Actor
Follow us on

వెండితెరపై అలరించే హీరోలకే కాదు.. బుల్లితెరపై సందడి చేసే నటీనటులకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఫ్యామిలీ అడియన్స్ నుంచి ఎక్కువగా అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. రోజూ తమ అభిమాన స్టార్స్ సీరియల్స్ చూడకపోతే రోజు గడవదు అన్నట్లుగా ఉంటుంది వారి అభిమానం. ఇప్పటివరకు టెలివిజన్ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నిరుపమ్ పరిటాల. కార్తీక దీపం సీరియల్‏తో ఏడు సంవత్సరాలు తిరుగులేని నటుడిగా చక్రం తిప్పారు. ఇక నిరుపమ్ తర్వాత అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇతనే. ఇప్పుడు బుల్లితెర సూపర్ స్టార్‏గా కొనసాగుతున్నాడు. ఈ చిన్నోడు నటిస్తోన్న సీరియల్ టీఆర్పీలోనూ టాప్‏లో ఉండడం విశేషం. అందంలోనే కాదు.. నటనతోనే ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఎవరో గుర్తుపట్టండి. ఇతడికి అమ్మాయిల ఫాలోయింగ్ కాస్త ఎక్కువనే చెప్పుకొవాలి.

స్టైల్‏గా సైకిల్ పై ఫోజులిస్తూనే.. మరో ఫోటోలో అమ్మ ఒడిలో కూర్చుని అమాయకంగా చూస్తున్న ఆ చిన్నోడు ఎవరంటే.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ స్థానంలో దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ రిషేంద్ర భూషణ్. ఇతని అసలు పేరు ముఖేష్ గౌడ. మోడలింగ్‏తో కెరియర్ స్టార్ట్ చేసిన ముఖేష్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. నాగకన్నిక అనే సీరియల్ తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ప్రేమనగర్ సీరియల్ తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ సీరియల్ తర్వాత ముఖేష్ నటిస్తోన్న సీరియల్ గుప్పెడంత మనసు. ఇందులో రిషి పాత్రలో ముఖేష్ నటన అద్భుతమనే చెప్పాలి. రిషి అంటే ఇగో పర్సన్.. తల్లంటే చెప్పలేనంత కోపం. అయినా.. వసుధారతో రిషి లవ్ ట్రాక్.. తల్లి జగతితో రిషి నటించే తీరు అభిమానులను కట్టిపడేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.