Tollywood:బాలయ్యతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్

ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. తన నటనా ప్రతిభకు ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. ఆ తర్వాత నటుడిగానూ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.

Tollywood:బాలయ్యతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్
Balakrishna

Updated on: Jun 01, 2025 | 5:01 PM

పై ఫొటోలో బాలయ్య బాబుతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన అతను నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించాడు. చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు. ఒక సినిమాలో అతని నటనకు ఏకంగా నంది పురస్కారం కూడా వచ్చింది. అప్పటికింకా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న అతను తన ఫ్రెండ్స్ తో కలిసి దివంగత మాజీ సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో అతను సోలో హీరోగా చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అంతే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఒకే ఒక్క సీరియల్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిల్లిపాదికి చేరువ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను మరెవరో కాదు బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగుల పల్లి.

ఇటీవల ఓ ఇంటర్వ్యుకు హాజరైన మానస్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
‘ బిగ్ బాస్ అమర్ దీప్, నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అమర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు. మేమిద్దరం కలిసి ఓ చైల్డ్ సినిమాలో నటించాం. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. . ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నేను ఇంకా ఫేమస్ అయ్యాను. మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా చేశాను. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నాను. హీరో సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా తీసుకున్నాను’ అంటూ అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మానస్.

ఇవి కూడా చదవండి

తల్లితో మానస్..

భార్య, కుమారుడితో..

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.