
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ. సీరియల్స్ ద్వారా జనాలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. సహజ సౌందర్యం.. తన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తెలుగులో ఆమె చేసిన సీరియల్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు సీరియల్స్ కు దూరంగా ఉంటున్న ఈ సొగసరి.. సినిమాల్లో కథానాయికగా అవకాశాలు అందుకుంటుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే సీరియల్ బ్యూటీ నవ్య స్వామి.
నవ్వ స్వామి.. తెలుగు సుపరిచితమైన పేరు. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు.. మైసూరులో 1990 మార్చి 17న జన్మించింది. మైసూర్ రోటరీ వెస్ట్ స్కూల్లో చదువుకున్న ఈ అమ్మడు.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది. ఆ తర్వాత మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఆ త్రవాత నాపేరు మీనాక్షి సీరియల్ ద్వారా తెలుగులో పాపులర్ అయ్యింది. అలాగే ఆమె కథ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ ద్వారా జనాల్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
ఇంటింటి రామాయణం, బుట్టబొమ్మ, రావణాసుర వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం సీరియల్స్ చేయకుండా కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?