Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయితేనేం.. గట్టిగానే సందీప్‌ మాస్టర్‌ రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?

|

Oct 30, 2023 | 8:06 AM

తొలివారంలోనే హౌజ్‌ మేట్‌ గా మారిపోయిన సందీప్‌ 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్‌ దక్కించుకున్నాడు. దీంతో నామినేషన్స్‌లోకి రాకపోయాడు. అదృష్టం కొద్దీ 6,7 వారాల్లోనూ మాస్టర్‌ నామినేషన్స్‌లోకి రాలేదు. అయితే ఇదే అతనికి మైనస్‌ గా మారింది. నామినేషన్స్‌లోకి రాకపోవడంతో సందీప్‌ మాస్టర్‌కు ఓటు బ్యాంక్‌ తక్కువగా ఉంది. దీనికి తోడు ఎనిమిదో వారంలో అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చాడు

Bigg Boss 7 Telugu: ఎలిమినేట్‌ అయితేనేం.. గట్టిగానే సందీప్‌ మాస్టర్‌ రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలో తెలుసా?
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో మొదటి మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ జరిగింది. హౌజ్‌ లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా కొనసాగుతూ, టాప్‌-5 లో కచ్చితంగా ఉంటాడని భావించిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ఆట సందీప్‌ అనూహ్యంగా ఎలిమినేట్‌ అయ్యాడు. మొదటి వారం నుంచి అసలు నామినేషన్స్‌లోకి రాని సందీప్‌ మాస్టర్‌ హౌజ్‌ నుంచి బయటకు రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తొలివారంలోనే హౌజ్‌ మేట్‌ గా మారిపోయిన సందీప్‌ 5 వారాల పాటు ఇమ్యూనిటీ పవర్‌ దక్కించుకున్నాడు. దీంతో నామినేషన్స్‌లోకి రాకపోయాడు. అదృష్టం కొద్దీ 6,7 వారాల్లోనూ మాస్టర్‌ నామినేషన్స్‌లోకి రాలేదు. అయితే ఇదే అతనికి మైనస్‌ గా మారింది. నామినేషన్స్‌లోకి రాకపోవడంతో సందీప్‌ మాస్టర్‌కు ఓటు బ్యాంక్‌ తక్కువగా ఉంది. దీనికి తోడు ఎనిమిదో వారంలో అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చాడు. శివాజీ, ప్రియాంక, గౌతమ్‌, భోలే షా వళి, అమర్‌ దీప్‌ చౌదరి, అశ్విని శ్రీ, శోభా శెట్టితో పాటు నామినేషన్స్‌లోకి వచ్చాడు సందీప్‌ మాస్టర్. ఎప్పటిలాగే శివాజీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. భోలే, అమర్‌ దీప్‌, అశ్వినిలకు కూడా ఎక్కువ గానే ఓట్లు పడ్డాయి. అయితే శోభా శెట్టి, సందీప్ మాస్టర్ లకు మాత్రం తక్కువ ఓట్లు వచ్చాయి. మొదట శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగినా.. ఫైనల్‌గా సందీప్‌ మాస్టరే హౌజ్‌ నుంచి బయటకు వచ్చాడు.

 

ఇవి కూడా చదవండి

సందీప్‌ మాస్టర్‌ సుమారు ఎనిమిది వారాల పాటు బిగ్‌ బాస్‌ ఇంట్లో ఉన్నాడు. బయటకు వెళ్తూ వెళ్తూ ఎమోషనల్‌ అయ్యాడు.  ఇక కంటెస్టెంట్లు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు.  అయితే ఎలిమినేట్‌ అయినా సందీప్‌ మాస్టర్‌కు బాగానే రెమ్యునరేషన్‌ అందినట్లు తెలుస్తోంది. వారానికి సుమారు రూ. .2.75 లక్షలు చొప్పున.. మొత్తం రూ.22 లక్షలు పైనే పోగు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద అమౌంట్‌ అని చెప్పుకోవచ్చు.

ఎలిమినేట్ అయినా గట్టిగానే..

బిగ్ బాస్ హౌజ్ లో సందీప్ మాస్టర్..

ఎనిమిది వారాలకు అన్ని లక్షలా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.