Ennenno Janmala Bandam: అంతులేని అమ్మప్రేమకు మరో రూపమే వేద.. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు..

|

Dec 11, 2022 | 5:37 PM

వంటలక్క తర్వాత ఆడియన్స్ ను అభిమానులుగా మార్చుకున్న హీరోయిన్లలో వేద ఒకరు. ఈమె అసలు పేరు దేబ్జానీ మోదక్ .

Ennenno Janmala Bandam: అంతులేని అమ్మప్రేమకు మరో రూపమే వేద.. బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయాలు..
Vedha
Follow us on

బుల్లితెరపై తెలుగు ఆడియన్స్‏ను ఆకట్టుకుంటున్న సీరియల్లలో ఎన్నేన్నో జన్మల బంధం ఒకటి. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ సోమ వారం నుండి శుక్ర వారం వరకు రాత్రి 9 గంటల ముప్పై నిమిషాల కు ప్రసారం అవుతుంది. మనసు పలికే మౌన గీతం సీరియల్ ని రీమేక్ చేసి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గా మన ముందు కి తీసుకు వచ్చారు. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యారు హీరోయిన్ వేద. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. వంటలక్క తర్వాత ఆడియన్స్ ను అభిమానులుగా మార్చుకున్న హీరోయిన్లలో వేద ఒకరు. ఈమె అసలు పేరు దేబ్జానీ మోదక్ . 1996లో మార్చి 20న వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తాలో జన్మించారు. అక్కడే సెయింట్ జాన్స్ సెకండరీ స్కూల్లో చదువుకున్న డెబి జాన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తియ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అపోన్ జాన్, ఓం నమహ్ శివాయ వంటి బెంగాలీ సీరియల్స్ తో పాటు పలు తమిళ్ సీరియల్స్ లోనూ నటించింది.

2013లో డె బి జాన్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. నాక్ ఔట్ సినిమాతో వెండితెరపై సందడి చేసింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ సినీ పరిశ్రమలో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బుల్లితెరపై పలు సీరియల్లలో నటించింది. ఇక హిందీలో వచ్చిన మనసు పలికే మౌన గీతం సీరియల్ కు రీమేక్ గా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మాతృత్వానికి దూరమైన ఓ అమ్మాయి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుంది.. తల్లిప్రేమకు దూరమైన ఓ చిన్నారికి అమ్మ ప్రేమను అందిస్తూ.. తల్లిగా.. భార్యగా.. వైద్యురాలిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఓ మహిళ జీవితం ఆధారంగా ఈ సీరియల్ సాగుతుంది. ఇందులో వేద నటనకు ప్రతి ప్రేక్షకుడు ముగ్దులవ్వాల్సిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.