Bigg Boss: నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా బయటకు చెబుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ధైర్యంగా ముందుకొచ్చింది. తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ వాపోయింది.

Bigg Boss: నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
Malti Chahar

Updated on: Dec 20, 2025 | 7:53 AM

భారత స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాల్తీ చాహర్ బిగ్ బాస్ హిందీ సీజన్ 19 హౌస్‌లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తన బిగ్ బాస్ జర్నీ గురించి అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలో తాను ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని షాకింగ్ విషయం బయటపెట్టింది మాల్తీ చాహర్. ఒక దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ డైరెక్టర్ తన తండ్రిగా భావించానని, కానీ ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఈ ముద్దుగుమ్మ వాపోయింది. అలాగే ఒక సీనియర్ ఫిల్మ్ మేకర్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని మాల్తి ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది తనను చాలా వేధించారని ఆమె చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది.

‘నా జీవితంలో నేను నేర్చుకున్న అతి పెద్ద విషయం ఏమిటంటే, ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ చెందినవారు కారు. కెరీర్ ప్రారంభంలోనే నాకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. వాటి గురించి నేను మా నాన్నగారికి కూడా చెప్పాను. కొంతమంది రెండు మూడు సార్లు నాతో అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ట్రై చేశార. కానీ నేను ఎవరినీ వారి పరిమితులను దాటనివ్వలేదు. ఇక్కడి వారు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి

మాల్తీ చాహర్ లేటెస్ట్ ఫొటోస్..

‘నేను ఒక పెద్ద సినిమా దర్శకుడి ఆఫీసుకి వెళ్లాను. ఒకరోజు అతను నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను షాక్ అయ్యాను. ఏమి జరిగిందో నాకు తెలియదు. నేను అతనిని అక్కడే ఆపేశాను. మళ్ళీ అతన్ని కలవలేదు. అతను చాలా పెద్దవాడు. కానీ నాతో ఇలా’ అంటూ వాపోయింది మాల్తీ చాహర్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సోదరుడు దీపక్ చాహర్ తో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.