
సీరియల్స్ ద్వారా స్మాల్ స్క్రీన్ పై ఫేమస్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. బుల్లితెరపై చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో నానా హంగామా చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బ్యూటీ సైతం సీరియల్స్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సీరియల్ తోనే ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి నెగిటివిటీ సంపాదించుకుంది. ఆ షోలో తన ఆట తీరు బాగున్నప్పటికీ ప్రవర్తన చూసి జనాలు విసుక్కున్నారు. బిగ్ బాస్ షోలో టాప్ 5 కంటెస్టెంట్ గా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఆమె మరెవరో కాదండి. మౌనరాగం సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు టీవీరంగంలోకి అడుగుపెట్టింది ప్రియాంక జైన్. ఇందులో అమాయకమైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఈ షో తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఇక ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలుద. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తన ప్రియుడు శివకుమార్ తో కలిసి వరుసగా రీల్స్ , వీడియోస్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
మౌనరాగం సీరియల్ హీరో శివకుమార్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పెళ్లికాకపోయినప్పటికీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. జంటగానే టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి పూజలు చేస్తుండడంతో ఇటీవల వీరి తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో బీచ్ ఒడ్డున ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రియాంక.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..