ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన అప్పూ నీకో గుడ్ న్యూస్ అని చెబుతుంది. ఏంటి ఇప్పుడు తిడతావా అని కళ్యాణ్ అడిగితే.. నిన్ను తిట్టడం నాకెమన్నా సరదానా అని అప్పూ అంటుంది. సరేలే కానీ మీ వదిన మళ్లీ మీ ఇంటికి వెళ్లబోతుందని చెప్తే.. ఏంటి నిజంగానా అని కళ్యాణ్ అడుగుతాడు. అంటే సగం వరకు నిజమని అప్పూ అంటుంది. కళ్యాణ్‌కు అర్థం కాకపోతే.. అప్పూ సీతారామయ్య చెప్పిన చెప్పిన కండీషన్ గురించి చెబుతుంది. వదిన ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. మళ్లీ అందరూ కలిసి సంతోషంగా ఉంటారని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న కనకం ఎంతో సంతోష పడుతుంది. అప్పుడే కావ్య ఇంటికి వస్తుంది. కావ్యని చూసిన కనకం.. ఏంటి కావ్యా పెద్దాయన పందెం కట్టారట.. నువ్వు మళ్లీ తిరిగి త్వరలోనే ఆ ఇంట్లో కాలు పెట్టబోతున్నావట.. అని అడుగుతుంది. అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చేసిందా? అని కావ్య అంటే.. పెద్దావిడ ఫోన్ చేసి చెప్పిందే. వెంటనే గుడికి వెళ్లి 100 కొబ్బరి కాయలు పెడతానని కనకం అంటుంది.
ఆగు ఆగు.. ఇంకా ఏమీ కాలేదు.. అక్కడ నేను పోటీ పడుతుంది మీ అల్లుడి గారితోనని కావ్య అంటుంది. నువ్వు పందెంలో గెలవడానికి నేను ఏం చేయాలో చెప్పు.. నువ్వు గదిలోంచి బయటకు రాకు.. నీ పనులన్నీ నేను చేసి పెడతానని కనకం అంటుంది. ఆ తర్వాత అనామికకు ఫోన్ చేస్తుంది రుద్రాణి. ఏంటి నాకు ఫోన్ చేశారని అనామిక అంటే.. అన్నీ అయిపోతాయని నువ్వు దూరంగానే ఉండి కలలు కనేస్తున్నావు.. కానీ ఇక్కడ నాకు ఆస్తి కాదు కదా.. ఆవ గింజ కూడా వచ్చేలా లేదని రుద్రాణి అంటుంది. ఏంటి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని అనామిక అడుగుతుంది. మనం వేసిన ప్లాన్ దెబ్బ కొట్టింది. పైగా ఆ రాజ్, కావ్యలను కలపాలని ఆ ముసలోడు చూస్తున్నాడని.. జరిగినదంతా చెబుతుంది రుద్రాణి.
అయితే ఇప్పుడు ఈ పందెంలో ఎవరు గెలిచినా మనకే నష్టమని అనామిక అంటుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టరే లేకపోతే.. ఈ పందెమే ఉండదు కదా.. నేనే స్వయంగా వెళ్లి మాట్లాడతాను. ఆ డీల్ మా కంపెనీకి వచ్చేలా చేస్తానని అనామిక అంటుంది. జగదీష్ చంద్ర అని చెబుతుంది రుద్రాణి. ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లిన రుద్రాణి.. చాలా జాలి వేస్తుంది. నీ స్థానంలో ఉంటే పట్టరాని కోపం వస్తుంది. నీ విషయంలో మాత్రం కోట్లు ఉన్నా కొడుకు ఆటో నడుపుతున్నాడని రుద్రాణి అంటుంది. ఇప్పుడు అంత జాలి పడాల్సిన అవసరం ఏముందని? ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు అంత పెద్ద గొడవ చేస్తే ఎవరైనా పట్టించుకున్నారా.. టైమ్ కావాలని తప్పించుకున్నారు. మరి కళ్యాణ్‌కు ఎలాంటి న్యాయం జరగాలి అని కదా ఆలోచించాలి.. కానీ మా అమ్మానాన్న ఏం చేస్తున్నారు? కంపెనీకి కాంట్రాక్ట్ వస్తే రాజ్, కావ్యలకు పందెం పెట్టారు. కానీ నీ కొడుకుని గాలికి వదిలేశారు. ఏదో ఒక రోజు నీ కొడుక్కి ఈ ఇంట్లో హక్కే లేదని చెప్పినా చెబుతారని అంటుంది రుద్రాణి. అంతా విన్న ధాన్యలక్ష్మి.. మండిపోతూ ఉంటుంది.
ఆ తర్వాత రాజ్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఆల్ ది బెస్ట్ చెప్పమని ఇన్ డైరెక్ట్‌గా అడుగుతూ ఉంటాడు. ఈ కామెడీ సీన్ నిజంగానే నవ్వు తెప్పిస్తుంది. దీంతో రాజ్ మండిపోతూ ఉంటుంది. అందరూ కావాలనే రాజ్‌ని ఆటపట్టిస్తూ ఉంటారు. అందంతా చూసి రుద్రాణి చిరాకు పడుతుంది. ఎక్కడా ఎన్నడూ చూడని వింత జరుగుతుందని దెప్పిపొడుస్తుంది.నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకు ఉంటాయిరా అని అంటుంది. ఆ తర్వాత ఆఫీస్‌కి వస్తాడు రాజ్. యుద్ధానికి వస్తున్నట్టు వస్తాడు. డిజైన్స్ గీయడానికి అన్నీ సెట్ చేయమంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. రాజ్‌ని చూసిన కావ్య.. పాపం ఎలాంటి మనిషి ఎలా అయిపోయాడో.. సిఈవో పదవి కోసం నాతోనే పోటీ పడతారట. డిజైన్స్ గీయాలంటే క్రియేటివిటీ ఉండాలని అంటుంది. ఇక కోపంతో వెళ్లిన రాజ్.. జీవితంలో నీ ముఖం ఆఫీసులో కనిపించకుండా చేయడం కోసమే నేను కంకణం కట్టుకున్నానని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య బూత్ బంగ్లా గురించి చెబుతుంది. మరోవైపు అనామిక.. జగదీష్ చంద్రతో డీల్ ఒప్పించడానికి సిద్ధం అవుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..