ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆస్తి పంపకాల వాటాలో ఏమాత్రం తగ్గొద్దని రుద్రాణి.. ధాన్యలక్ష్మికి సలహా ఇస్తుంది. ఈ ఇంటి అధికారాన్ని ఎలాగైనా దగ్గించుకోవాలని ఆ కావ్య అడ్డు పడుతూనే ఉంటుంది. అటు నుంచి నరుక్కొస్తూ కంపెనీ సిఈవో అయిపోయింది. ఆ కావ్య మా నాన్నని ఎంత మార్చేయకపోతే.. దుగ్గిరాల ఇంటి వారసుడు రాజ్‌ని పక్కన పెట్టి.. కావ్యని ఎందుకు సిఈవో చేస్తాడు. ఆ కావ్య మా అమ్మానాన్న మనసు మార్చి.. అడ్డుపడక ముందే ఈ ఆస్తి పంపకాలు జరిగిపోవాలి. వాళ్లు ఆలోచించుకోవడానికి టైమ్ అస్సలు ఇవ్వకూడదని రుద్రాణి అంటుంది. ఈసారి ఎవరు ఎన్ని వేషాలు వేసినా.. ఈ సారి నేను తగ్గను. నా కొడుక్కి రావాల్సిన వాటా నాకు ఇచ్చి తీరాల్సిందేనని ధాన్యలక్ష్మి వెళ్తుంది. ప్లాన్ సక్సెస్ అయినందుకు రుద్రాణి సంతోష పడుతుంది. ఇక తెల్లవారుతుంది.. అందరూ హాలులో కూర్చొంటారు. ధాన్యలక్ష్మికి కిందకు దిగుతుంది.
నేనేం మాట్లాడినా మీ అందరికీ తప్పుగానే అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు నేను ఇంటి కోడల్ని మాత్రమే. కానీ దుగ్గిరాల ఇంటి వారసుడికి కన్న తల్లిని. ఈ ఇంటి వారసుడు బ్రతకడానికి కష్ట పడటం చూడలేకనే తల్లిగా స్పందించడంలో తప్పుల లేదని భావిస్తున్నాను. మావయ్య గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అందుకే ఇప్పటి వరకూ ఓపిక పట్టాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్తారని ఎదురు చూస్తున్నానని ధాన్యలక్ష్మి అంటే.. ఇది ఈ ఇంటి పెద్దగా నాకు ఒక అగ్నిపరీక్ష. తరతరలుగా ఒక ఇంటి వృక్షంగా బ్రతికిన నేను.. కొమ్మా, రెమ్మలు విసిరేస్తే.. ఎలా అని ఆలోచిస్తున్నా. వందేళ్ల చరిత్రను నేను ఒక్క రోజులో మార్చలేను. కాస్త వ్యవధి కావాలని సీతారామయ్య అడుగుతాడు. ఎంత సమయం కావాలి మావయ్య గారు? మీరు సమయం అడిగారంటే ఈ లోపు ఏమన్నా జరగవచ్చు.. అంతా కలిసి నా నోరు మూయించవచ్చు.. దయచేసి నెలలు నెలలు గడపకండని ధాన్యలక్ష్మి అంటుంది.
ధాన్యలక్ష్మీ ఏం కావాలి నీకు? లోకం తెలియని వెర్రిబాగుల దానివా.. అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు చవటా కూర్చుంటేనే నువ్వు ఇలా మట్లాడుతున్నావ్? ఏరా సిగ్గు లేదా నీకు? పెళ్లాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోవడం చేత కాదు? నీ తండ్రి నిస్సహాయంగా మాట్లాడుతుంటే అది అర్థం చేసుకోకుండా నోరు జారి మాట్లాడుతుందని ఇందిరా దేవి అంటుంటే.. నేనేం తప్పుగా మాట్లాడలేదని ధాన్యలక్ష్మి అనేలోపు.. నోర్ముయ్.. కోడలి మీద చేయి చేసుకున్న చరిత్ర దుగ్గిరాల చరిత్రలోనే లేదు. మీ తాతల ఆస్తులు ఏమన్నా పసుపు కుంకాల కింద తెచ్చి మా ఆస్తుల్లో కలిపేశావా? ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న పరువును బజారున పడేయాలని చూస్తుంటే.. నిన్ను ఏమీ అనలేక ఆయన ఎంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. కోడలిగా హక్కులు అడిగే ముందు బాధ్యతలు కూడా తెలుసుకోవాలని ఇందిరా దేవి అంటుంది.
నాకు తెలుసు అమ్మా ఇలా అడిగితే.. నోట్లో మట్టి కొట్టి నోరు మూయిస్తారని.. అసలు అని రుద్రాణి మొదలు పెడుతుంటే.. అత్తా ఇంకొక మాట మాట్లాడితే నేనే నిన్ను ఈ ఇంట్లోంచి గెంటి పాడేస్తాను. ఈ ఇంటిని ముక్కలు చేయమన్న ఆలోచన నీదే అని నాకు బాగా తెలుసు. మంచి చేయడం చేతకాని నువ్వు.. ఎలాగైనా నీ వాటా దక్కించుకోవాలని ప్లాన్లు వేసింది చాలు. నోరు మూసుకుని ఉండమని గడ్డి పెడుతుంది. అప్పడే రాజ్ వచ్చి నాన్నమ్మా.. ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు.. అప్పూని కోడలుగా ఒప్పుకుంటే ఇంటికి వస్తారని రాజ్ అంటాడు. ఏరా మీ పిన్ని ఏం చేయాలో నువ్వు చెబుతున్నావ్. నువ్వు ఏం చేయాలో నీకు తెలుసా? భార్యని పుట్టింట్లో పెట్టి.. తమ్ముడి భార్యని క్షమించమని సలహా ఇస్తున్నావ్? అసలు మొత్తం మూలం పడిందే నీ దగ్గర అని రాజ్‌కి గడ్డి పెడుతుంది ఇందిరా దేవి.
ఆ తర్వాత ఆఫీసులో కావ్య దగ్గరకు వచ్చిన శ్రుతి.. ఫైల్ ఇస్తుంది. సుగుణ కంపెనీ గ్రూప్ డిజైన్స్ అని అంటుంది. రాజ్ సర్ డిజైన్స్ అప్ లోడ్ చేశారా? అని అడిగితే.. లేదని శ్రుతి చెబుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరకు వెళ్తుంది కావ్య. అప్పటికే రాజ్ ఫోన్‌లో గేమ్ ఆడుతూ కనిపిస్తాడు. దీని మీద ఎందుకు సంతకం చేయలేదని కావ్య అడిగితే.. మూడ్ లేదని రాజ్ అంటాడు. ఇప్పటికే లేటు అయిందని కావ్య అంటుంటే.. రాజ్ అర్థం లేని సమాధానం చెబుతాడు. ఎందుకు? ఏంటి? అని కావ్య అడిగితే.. నాకు ఆ కంపెనీతో డీల్ చేయడం నచ్చలేదని రాజ్ అంటాడు. మీ ఇష్టాఇష్టాలతో నాకు సంబంధం లేదు.. కంపెనీ సుపీరియర్ మాటలు వినకపోతే డిస్మిస్ చేస్తానని కావ్య అంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్లి ఎంత తుఫాను సృష్టించగలనో అని రాజ్ అంటే.. మిగతా విషయాలు అన్నీ మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఈ ఫైల్ మీద సంతకం చేయమని కావ్య అంటే.. రాజ్ ఫైల్ తీసుకుని వెళ్తాడు.
రాజ్ ఫైల్ తీసుకుని నేరుగా సీతారామయ్య దగ్గరకు వెళ్తాడు. కావ్యని సిఈవో చేయడం వల్లే పిన్ని ఆస్తులు పంచమందని చెప్తాడు. కానీ ఈ సమస్యలు మొదలవ్వడంన నీ వల్లనే అని సీతారామయ్య అంటాడు. నేనా? నా వల్ల ఏం సమస్యలు అని రాజ్ అంటే.. కావ్యని సిఈవో చేయడం.. తన కింద పని చేయడం నీకు నచ్చడం లేదు. అందుకే ఈ గొడవ చేస్తున్నావని సీతారామయ్య అంటాడు. ఆవిడ గారు తీసుకున్న డెసిషన్స్ నాకు నచ్చడం లేదు. ఆవిడ చెప్పినట్టు నేను వినాలంట అని రాజ్ అంటే.. అదీ విషయం.. కావ్యని ఎట్టి పరిస్థితుల్లో కూడా కావ్యని సిఈవో పోస్ట్ నుంచి తప్పించనని సీతారామయ్య అంటాడు.
ఈ తర్వాత రుద్రాణి అప్సెట్ అవుతుంది. ధాన్యలక్ష్మిని రెచ్చగొడితే.. ఆ ముసలోడు ఆస్తులు ముక్కలు చేస్తాడు అనుకున్నా.. కానీ ఇలా తప్పించుకుంటాడు అనుకోలేదు. ఆ కావ్యని బయటకు పంపిస్తే.. తీసుకొచ్చి కంపెనీ సిఈవో చేసి మన నెత్తిన పెట్టాడు. ఇప్పుడు సమయం దొరికితే మరో ప్లాన్‌తో వస్తాడని రుద్రాణి అంటే.. అవును మమ్మీ అని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. అబ్బో ఏంటి ప్లాన్స్ వేస్తున్నారు? తాతయ్య మిమ్మల్ని పెంచుకున్నాడని స్వప్న అంటుంది. ఆస్తి పంచితే నీ మొగుడికే వస్తుంది కదా.. అని రుద్రాణి అంటే.. అది మీరే పీక్కుని తింటారు.. ఇక నాకేం మిగులుతుంది.. అదే కలిసి ఉంటే ఉన్నన్ని రోజులు హాయిగా బ్రతకొచ్చు. మీరు కూడా ఈ విషయాన్ని రియలైజ్ చేసుకుంటే బెటర్ అని స్వప్న వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మమ్మీ ముందు దీన్ని వేసేయాలని రాహుల్ అంటాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..