Brahmamudi, February 17th episode: ‘బ్రహ్మముడి’లో కొత్త హీరో ఎంట్రీ.. రాజ్‌కు ఇక చుక్కలే చుక్కలు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతను అక్కా అని పిలవాలా.. చెల్లి అని పిలవాలా అని కనుక్కుని చెప్పమంటుంది కావ్య. ఇది విన్న రాజ్.. ఏంటి ఇది.. దీనికి నేను షాక్ ఇద్దామనుకుంటే.. తిరిగి నాకు ఇచ్చింది. గ్యాప్ లేకుండా వాయించేసింది. దరిద్రం వదిలిందని రిలాక్స్ అయ్యిందా.. అని రాజ్ ఆలోచిస్తుండగానే.. ఏవండీ మీకు చెప్పడం మర్చిపోయా.. మీకో సర్ ప్రైజ్ ఇస్తున్నా.. బీ రెడీ అని అంటుంది. ఏంటా సర్ ప్రైజ్ అని అడుగుతాడు రాజ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతను అక్కా అని పిలవాలా.. చెల్లి అని పిలవాలా అని కనుక్కుని చెప్పమంటుంది కావ్య. ఇది విన్న రాజ్.. ఏంటి ఇది.. దీనికి నేను షాక్ ఇద్దామనుకుంటే.. తిరిగి నాకు ఇచ్చింది. గ్యాప్ లేకుండా వాయించేసింది. దరిద్రం వదిలిందని రిలాక్స్ అయ్యిందా.. అని రాజ్ ఆలోచిస్తుండగానే.. ఏవండీ మీకు చెప్పడం మర్చిపోయా.. మీకో సర్ ప్రైజ్ ఇస్తున్నా.. బీ రెడీ అని అంటుంది. ఏంటా సర్ ప్రైజ్ అని అడుగుతాడు రాజ్.. చెప్తే అది సర్ ప్రైజ్ ఎలా అవుతుంది అని అంటుంది కావ్య. సర్ ప్రైజ్ చెప్పకపోతే.. అది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అవుతుంది. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఏంటి? అని ఓ ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.
ఆఫీస్‌లో కూడా కళ్యాణ్ కవితల గోల..
ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ కోసం గదిలో వెయిట్ చేస్తుంది అనామిక. కళ్యాణ్ ఫ్రెష్ అయి బయటకు రాగానే.. మీ కోసమే వెయిట్ చేస్తున్నా అని అనామిక అనగానే.. అయితే ఇంకేంటి లేట్.. రా అని కళ్యాణ్ దగ్గరకు తీసుకుంటాడు. హేయ్.. దీని గురించి కాదు మీరు ఆఫీస్‌లో ఈ రోజు ఏం చేశారు చెప్పండి అని అడుగుతుంది అనామిక. దీంతో ఆఫీస్‌లో జరిగింది అంతా గుర్తుకు తెచ్చుంటాడు కళ్యాణ్. అక్కడ కూడా కవితల గురించి రాసుకుంటూ.. స్టాఫ్ గురించి చెప్తూ ఉంటాడు. ఈ నెక్ట్స్ సెక్యూరిటీ గార్డును కూడా వదలకుండా కవితలు చెప్తాడు కళ్యాణ్. అదంతా అనామిక దగ్గర దాచి.. వేరే చెప్తాడు. అది విన్న అనామిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీంతో గ్రేట్‌గా ఫీల్ అవుతుంది అనామిక. ఆ తర్వాత అనామిక ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ ని కింద పడేసి అలిగి పడుకుంటాడు.
రుద్రాణికి ఝలక్ ఇచ్చిన స్వప్న..
మరోవైపు కావ్య ఇస్తున్న సర్ ప్రైజ్ గురించి తెగ ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. కావ్యను నిద్ర లేపి మరీ సర్ ప్రైజ్ గురించి అడుగుతాడు. కానీ కావ్య చెప్పకుండా ఉడికిస్తుంది. ఆ తర్వాత బెదిరిస్తుంది. దీంతో రాజ్ పడుకుంటాడు. ఇంకోవైపు స్వప్న దగ్గరికి పని మనిషి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అదేంటి? నువ్వు వచ్చావ్.. ఆవిడ ఎక్కడ అని సీరియస్ అవుతుంది. నేరుగా రుద్రాణి దగ్గరకు వెళ్తుంది. అక్కడ రుద్రాణి పాటలు వింటూ.. జ్యూస్ తాగుతూ రిలాక్స్ అవుతుంది. ఒక్కసారిగా స్వప్నను చూసి షాక్ అవుతుంది. అంకుల్‌ని వదిలేసి.. ఇప్పుడు తలుచుకుంటూ.. ఈ వేళలో నీవు అని పాటలు పాడుకుంటున్నావా.. అని అడుగుతుంది. నా భర్త గురించి నీకెందుకు అని రుద్రాణి అడుగుతతుంది.
నాకు మీరే సేవలు చేయాలి.. లేదంటే మీ బాగోతాన్ని బయట పెడతా: స్వప్న
నాకు చేయాల్సిన పనులు చేయకపోతే.. ఇలాగే మాట్లాడతా అని అంటుంది స్వప్న. అందుకు పని మనిషిని పెట్టానుకు కదా.. ఇంకేంటి అని రుద్రాణి అంటుంది. పని మనిషి సొంత మనిషి కాదు కదా.. ఏదైనా ప్రాబ్లమ్ అయితే అని అడుగుతుంది స్వప్న. నీకు పని చేయడం కావాలా.. పనిమనిషి కావాలా అని రుద్రాణి అడిగితే.. రెండూ కావాలి అని అంటుంది. మీరు అయితే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తారు అని స్వప్న అంటుంది. నీకు సేవలు చేయడం నా వల్ల కాదని అంటుంది రుద్రాణి. దీంతో రెచ్చిపోయిన స్వప్న.. రెండు లక్షలు కొట్టేసింది మీరేనని.. అది కావ్య మీద తోసేయాలని చూశారని ఇంట్లో వాళ్లకు చెప్తాను అని బెదిరించి వెళ్తుంది.
రాజ్ సర్ ప్రైజ్ గోల.. ఇందిరా దేవి ప్లానా.. మజాకా..
ఇంకోవైపు నిద్రలో కూడా రాజ్.. సర్ ప్రైజ్ గురించి కలవరిస్తూ ఉంటుంది. లేచి చూడగానే కావ్య ఉండదు. దీంతో కంగారు పడి.. కావ్యను వెతుక్కుంటూ వస్తాడు. ఆ సర్ ప్రైజ్ గురించి ఏంటో చెప్పు అని రాజ్ అడుగుతాడు. అప్పుడే వచ్చిన ఇందిరా దేవి.. ఏంట్రా ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది. అవును కావ్యా ఇంకా అలాగే ఉన్నావ్.. సర్ ప్రైజ్ సంగతి మర్చిపోయావా.. వెళ్లి త్వరగా రెడీ అవ్వు అని అంటుంది. సరే అని చెప్పి కావ్య వెళ్తుంది. ఏంటి నానామ్మా నీకు తెలుసా సర్ ప్రైజ్ గురించి అని అడుగుతాడు రాజ్. తెలుసు.. కానీ ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలీదు అని పెద్దావిడ కావాలనే చెప్తుంది. దీంతో రాజ్ పిచ్చెక్కిపోతాడు.
వస్తున్న ‘బావా’.. ఫ్రస్ట్రేషన్‌లో రాజ్..
ఆ తర్వాత రాజ్ పైకి వచ్చేలోపు కావ్య రెడీ అవుతుంది. ఏంటి అప్పలమ్మలా రెడీ అవుతున్నావ్ అని అంటాడు. సర్ ప్రైజ్ గోల ఏంటి? ఎప్పుడు తెలుస్తుందని రాజ్ అంటాడు. నేను ఎయిర్ పోర్టుకు వెళ్తున్నా.. వచ్చాక మీకే తెలుస్తుంది అని చెప్తుంది కావ్య. ఎందుకు వెల్తున్నావ్ ఎయిర్ పోర్టుకు అని అడగ్గాన్నే.. కావ్య మెలికలు తిరుగుతుంది. మా బావ అమెరికా నుంచి వస్తున్నాడు. ఆరు అడుగులు.. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఇవాళే ఇండియాకు వస్తున్నాడు. ఒకప్పుడు మా బావ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తనతో పాటు ఫారిన్ తీసుకెళ్లాలి అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ మీతో నా పెళ్లి అయిపోయిందని కావ్య అంటుంది. ఏంటి నాతో పెళ్లి దురదృష్టవ శాత్తూ జరిగిందా.. అని రాజ్ సీరియస్ అవుతాడు. ఇక్కడ కామెడీ ట్రాక్ అదిరిపోతుంది. సరే లేటు అవుతుంది.. నేను వెళ్తున్నా అని వెళ్తుంది కావ్య. ఇంతకీ మీ బావ పేరేంటి? అని రాజ్ అడుగుతాడు. బావా అని సిగ్గు పడుతుంది కావ్య.
నేను కావ్య దగ్గర చేయి చాచాలా.. ధాన్యలక్ష్మికి పొగ పెట్టిన అనామిక
ఇంతలో కళ్యాణ్ ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటాడు. ఏంటి ఈ రోజు ఆఫీస్‌కి రెడీ అవుతున్నారా.. ప్లాన్ చేంజ్ అని అనామిక అంటుంది. అయితే ఇంకేం. ఈ రోజు ఇంట్లో కూడా రెస్ట్. బెడ్ రూమ్ తలుపు తీయాల్సిన అవసరం లేదని కళ్యాణ్ అంటాడు. అబ్బా ఎప్పుడూ అదే గోలా నీకు అని అనామిక అంటుంది. కొత్తగా పెళ్లైన వాడికి ఇంకేం గోల ఉంటుందని కళ్యాణ్ అడుగుతాడు. ఇప్పుడు మనం షాపింగ్‌కి వెళ్తున్నాం అని అనామిక చెప్తే.. సరే ఇప్పుడే వస్తాను అని కళ్యాణ్ అంటాడు. ఎక్కడికి అని అనామిక అయోమయంగా అడుగుతుంది. ఇన్ని రోజులూ మా పెద్దమ్మ చూసుకుంది. ఇప్పుడు కావ్య వదిన చూసుకుంటుంది కదా.. కాబట్టి తన దగ్గరే ఉంటాయని కళ్యాణ్ అంటాడు. అంటే నీ దగ్గర ఎప్పుడూ మనీ ఉండదా అని అనామిక సీరియస్‌గా అడుగుతుంది. కవితలు రాస్తూ క్రెడిట్ కార్డులను మర్చిపోయేవాడిని. అందుకే ఇంట్లో అందరూ కలిసి నా కార్డ్స్ నాకు వద్దు అనుకున్నారు. అవసరం అయినప్పుడు నేనే వెళ్లి తెచ్చుకుంటా అని అంటాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు వెళ్లి కావ్య అక్కని అడుక్కోవాలా అని అనామిక అంటే.. అవును అని కళ్యాణ్ అంటాడు. అయితే అవసరం లేదు అని కోపంగా ధాన్య లక్ష్మి దగ్గరకు వస్తుంది అనామిక. ను ఈ ఇంటి కోడలినే కదా.. నేను మా ఆయనతో బయటకు వెళ్లాలన్నా.. ఆవిడ దగ్గర చేయి చాచి వెళ్లాల్సిన కర్మ నాకెందుకు అని పొగ పెడుతుంది అనామిక.