Brahmamudi, August 17th episode: రాజ్ ని ఓ ఆట ఆడుకుంటున్న కావ్య.. చిర్రుబుర్రులాడుతోన్న అపర్ణ!!

|

Aug 17, 2023 | 1:31 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఇల్లు గురించి కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ బాధపడుతూంటారు. ఈ లోపు కావ్య, రాజ్ లు వస్తారు. ఈలోపు కనకం.. అనుకున్నదంతా అయ్యింది.. కావ్యను ఇంట్లోనుంచి పంపేశారు చూడండి.. అంటూ కనకం ఏడుస్తుంది. కావ్య ఏమో రాజ్ ని కిందకు దిగమని.. రండి మా నాన్న వాళ్లకు చెప్పేసి వెళ్లండి ప్లీజ్ అంటూ అడుగుతంది. కానీ రాజ్ మాత్రం నీకు ముందే చెప్పాను కదా నాకు ఆఫీసులో లేట్ అవుతుందని అని అంటాడు. కానీ కావ్య, రాజ్ వాళ్లు మాట్లాడుకున్నది తెలీక.. అది ఎంత దీనంగా బతిమలాడుతున్నా.. అల్లుడు గారు దిగడం లేదని కనకం..

Brahmamudi, August 17th episode: రాజ్ ని ఓ ఆట ఆడుకుంటున్న కావ్య.. చిర్రుబుర్రులాడుతోన్న అపర్ణ!!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఇల్లు గురించి కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ బాధపడుతూంటారు. ఈ లోపు కావ్య, రాజ్ లు వస్తారు. ఈలోపు కనకం.. అనుకున్నదంతా అయ్యింది.. కావ్యను ఇంట్లోనుంచి పంపేశారు చూడండి.. అంటూ కనకం ఏడుస్తుంది. కావ్య ఏమో రాజ్ ని కిందకు దిగమని.. రండి మా నాన్న వాళ్లకు చెప్పేసి వెళ్లండి ప్లీజ్ అంటూ అడుగుతంది. కానీ రాజ్ మాత్రం నీకు ముందే చెప్పాను కదా నాకు ఆఫీసులో లేట్ అవుతుందని అని అంటాడు. కానీ కావ్య, రాజ్ వాళ్లు మాట్లాడుకున్నది తెలీక.. అది ఎంత దీనంగా బతిమలాడుతున్నా.. అల్లుడు గారు దిగడం లేదని కనకం.. వద్దమ్మా ఇలాంటివి అని నేను చెప్పినా కావ్య వినలేదని కృష్ణమూర్తి బాధపడతారు. వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి.. నీ కాపురం ముక్కలు అయిపోయిందమ్మా.. అల్లుడు గారూ మీకిది భావ్యం కాదండి అని కనకం, కృష్ణమూర్తి అంటూంటారు. ఆపండి మీరిద్దరూ.. అసలు మీరు ఏమనుకుంటున్నారు? అని కావ్య ప్రశ్నిస్తుంది. ఇంకేమనుకుంటాం తల్లీ అంటూ వాళ్లిద్దరూ కన్నీరుమున్నీరవుతారు. దీంతో కావ్య మాట్లాడుతూ.. మా ఆయన నన్ను వదిలేయలేదు. తాతయ్యా, అమ్మమ్మా మన ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే.. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు అని చెప్తుంది. కనకం ఎందుకు? అని అడుగుతుంది. ఇక్కడ విగ్రహాలు తయారు చేయడానికి అని చెప్తుంది కావ్య.

దీంతో కృష్ణమూర్తి ఆ కాంట్రాక్ట్ పోయిందిగా.. అని దిగాలుగా అంటాడు. దీనికి రాజ్ రియాక్ట్ అవుతూ.. కాంట్రాక్ట్ పోలేదండి. ఇంట్లో గొడవలకు కారణం అవుతుందని.. నేనే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించాను. మళ్లీ మా తాతయ్య ఒప్పుకున్నారని.. మళ్లీ ఆ కాంట్రాక్ట్ మీకు ఇమ్మని చెప్పాను అని అంటాడు. దీంతో కనకం, కృష్ణమూర్తి.. ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సంతోషిస్తారు. ఆ తర్వాత రాజ్, కావ్యని లోపలికి రమ్మని పిలుస్తారు. రాజ్ కుదరదని చెప్తాడు. కానీ కావ్య.. సెల్ ఫోన్ వీడియో చూపించి.. రాజ్ ని బెదిరిస్తూ.. టిఫినే కదండి తినేసి వెళ్లండి.. వాళ్లు సంతోషపడతారు అని చెప్తుంది. దీనికి రాజ్ ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు.

ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ సీతారామయ్య, ఇందిరా దేవిల దగ్గరకు వచ్చి కావ్య గురించి మీతో ఒక విషయం మాట్లాడాలని అంటుంది. కావ్య విషయంలో మీరు చేస్తుంది తప్పు మావయ్య గారూ అని అంటుంది. క్షమించాలి.. మావయ్య గారిని తప్పు పట్డం నా ఉద్దేశం కాదు. కానీ కావ్య విషయంలో మావయ్య గారు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సీతారామయ్య మాట్లాడుతూ.. అంటే కావ్యని పుట్టింటికి పంపించకుండా అడ్డుపడాలని చెబుతున్నావా? అని అడుగుతున్నారు. లేదు మావయ్య గారూ అది మీరు తీసుకున్న నిర్ణయం.. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. మీ మాటకు విలువ ఇచ్చి ఒప్పుకున్నాను అని చెప్తుంది అపర్ణ. మరి ఏం తప్పు జరిగింది అపర్ణ అని ఇందిరా దేవి అడుగుతుంది. తనని తన ఇంటి దగ్గర దింపడానికి రాజ్ ని తోడుగా పంపించడం నాకు ఎందుకో ఇష్టం లేదు అత్తయ్య అని అంటుంది. అందులో తప్పేం ఉందని ఇందిరా దేవి అడుగుతుంది. కానీ కావ్య అలా ప్రవర్తిస్తుందా? ఇంట్లో పెద్దవాళ్ల మాటలకు గౌరవం ఇవ్వడం లేదు. తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. కావ్య చేసే పని రాజ్ కు నచ్చడం లేదు. ఇప్పుడు తనకు ఇష్టం లేకపోయినా.. మీరు చెప్పారని తీసుకెళ్లాడు. తప్పులు చేసినా తోడుగా మీరున్నారని ధైర్యంతో.. భర్తను కూడా ఎదిరిస్తుంది అని అంటుంది అపర్ణ.

ఇవి కూడా చదవండి

మొదటి నుంచీ నువ్వు కావ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అమ్మా.. తనది ఆత్మాభిమానం. తనకు తెలిసిన విద్యను ఉపయోగించుకుని.. తను ఎదగాలనుకుంటుంది. అందులో తప్పేముంది? అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. దాని కోసమే కదా మావయ్యా.. మన కంపెనీలో పనిచేయమని చెప్పింది. మరి పొగరు తగ్గించుకుని, ఎందుకు చేయనని చెప్పింది అని అపర్ణ ప్రశ్నించగా.. అత్తారింటి డబ్బును పుట్టింటికి దోచుకెళ్తున్నావ్ అని అవమానిస్తే చేయను అంది. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది. నా భయం అంతా ఇంట్లో జరుగుతున్న గొడవలకు కావ్య, రాజ్ ల మధ్య దూరం పెరుగుతుందని, అందుకే రాజ్ ని డ్రాప్ చేయమని చెప్పాను సీతారామయ్య అంటాడు.

ఇక ఈ సీన్ కట్ చేస్తే.. చిన్న హెల్ప్ కవి తండ్రి అంటూ కళ్యాణ్.. ప్రకాశంను సహాయం అడుగుతాడు. చెప్పు నాన్న అని అంటాడు ప్రకాశం. నాకు కలర్ పెన్సిల్స్, పేపర్స్ కావాలి అని అడుగుతాడు. అలాగే కవి పుత్రా.. నీకు కవితలు రాసే ఉత్సామం ఇనుమడించిందన్న మాట. తప్పకుండా కలర్స్ పేపర్స్, పెన్స్ తెప్పిస్తాను. నీలాంటి కవిని కన్నందుకు నా పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది కదా అంటాడు ప్రకాశం. అందరు తల్లిదండ్రులు కొడుకులోని ప్రతిభని గుర్తిస్తే.. ఇంటికో కళాకారుడు పుడతాడు తండ్రి. నీలాంటి తండ్రి ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అంటాడు. నిన్ను ఖచ్చితంగా మెప్పిస్తా.. అజ్ణాతం నుండి బయటకు రప్పిస్తా అని అనామిక గురించి అంటాడు కళ్యాణ్.

ఇక అపర్ణలో విషం నింపేందుకు రుద్రాణి ట్రై చేస్తుంది. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా కావ్యతో రాజ్ ని ఎలా పంపించావ్ అని అంటుంది. బాధ నా గురించి కాదు వదినా.. నీ గురించి.. అసలే కావ్య నీ మాట అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తోంది. నువ్వు వద్దు అని చెప్పినా.. తన పుట్టింటికి వెళ్తుందని అపర్ణని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. దీనికి అపర్ణ రియాక్ట్ అవుతూ.. ఏం చెప్పాలి అనుకుంటున్నావో.. సూటిగా చెప్పు అని అంటుంది. కావ్య చెప్పిందల్లా రాజ్ చేస్తున్నాడంటూ.. రాజ్ ని కావ్య మార్చేస్తుంది అని అంటుంది రుద్రాణి. నువ్వు అంతగా బాధపడిపోకు.. నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది అని అంటుంది. కావ్య ఎలాంటిదైనా కావచ్చు. రాజ్ నా పెంపకంలో పెరిగాడు అని జవాబు ఇస్తుంది అపర్ణ. అని మనం అనుకుంటాం. కానీ కనకం ఊరుకుంటుందా.. ఇంటికి ఆహ్వానించకుండా ఉంటుందా? అని లేనిపోనివి అపర్ణకు చెప్తుంది రుద్రాణి.

ఇక నెక్ట్స్.. అత్తగారింట్లో ఉప్మాపై ఉన్న చిరాకును చెప్తూ ఉంటాడు రాజ్. దానికి కావ్య నవ్వుతూ ఉంటుంది. ఈ ఉప్మానా నేను చచ్చినా తినను అంటుంది కావ్య. అంటే ఇప్పుడు నేనేనా బకరాని.. ఇప్పుడు నువ్వు తింటేనే నేను తింటా పట్టు అని బలవంతంగా కావ్యని ఉప్మా పెడతాడు రాజ్. ఇదంతా చూసి కనకం, కృష్ణమూర్తిలు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక కాంట్రాక్టర్ శ్రీను వస్తాడు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుంటూ.. రా శ్రీను రా.. నీకోసమే వేడి వేడి ఉప్మా ఎదురు చూస్తుంది అని అంటాడు రాజ్. దీనికి శ్రీను మాట్లాడుతూ.. మా ఆవిడని పంపించి ఆరు నెలలు అయింది సర్.. ఎందుకు? అని రాజ్ అడగ్గా.. రోజూ ఉప్మా చేస్తున్నందుకు.. నేనే మా ఆవిడని పంపించేశాను సర్ అని చెప్తాడు.

ఈలోపు కావ్య ఏంటి మళ్లీ వచ్చారు? అని అడుగుతుంది. ఆ కాంట్రాక్ట్ ని మీకే తిరిగి ఇవ్వడానికి అని చెప్తాడు. మాకు వద్దండి.. మేము మీ కాంట్రాక్ట్ ని ఒప్పుకోవడం లేదని చెప్తుంది కావ్య. అతనే ఏమన్నా బలవంతంగా ఉప్మా తినమంటున్నాడా.. కాంట్రాక్టే ఇస్తా అని అంటున్నాడుగా అని రాజ్ అనగా.. పెళ్లి ఆగిపోయిందా.. పట్టు చీర విప్పేస్తా.. పెళ్లి జరుగుతుందా.. పట్టుచీర కట్టకుంటా అన్నట్టు.. మీరు రానప్పుడల్లా ఆగిపోయి.. మీరు వచ్చినప్పుడల్లా ఒప్పుకోవాలా? అని కావ్య నిలదీస్తుంది. మరి ఎందుకు వచ్చావ్? ఇక్కడికి అని రాజ్ అడగ్గా.. మీరు డ్రాప్ చేస్తే.. మా వాళ్లు మన మధ్య గొడవలు లేవని తెలుసుకుంటారని.. కావ్య చెప్తుంది.

సర్ మీరే నన్ను కాపాడాలి.. విగ్రహాలు మాకు చాలా అవసరం.. అని కాంట్రాక్టర్ అనగా.. కానీ మీరు మధ్యలో డ్రాప్ అవరని గ్యారెంటీ ఏంటి? కావ్య అడగ్గా.. అదేంటమ్మా అలా అంటున్నావ్ నా మీద నమ్మకం లేదా అని కాంట్రాక్టర్ అంటాడు. ఒకసారి నమ్మినందుకేగా అలా చేశారని కావ్య ప్రశ్నిస్తుంది. మరి ఏం చేయాలి అని శ్రీను అడగ్గా.. మాకు నమ్మకం కలిగించాలి. చివరి వరకు ఈ అగ్రిమెంట్ మాకే అని ఈ పేపర్స్ మీద సంతకం చేయండి అని కావ్య చెప్తుంది. సరే అని శ్రీను సంతకం చేస్తాడు. ఇది రాసినా నమ్మకం ఏంటి? సాక్షి సంతకం కావాలి అని అడుగుతుంది.. కావ్య. ఇప్పటికిప్పుడు సాక్షిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు రాజ్ అడగ్గా.. మీరున్నారుగా అని చెప్తుంది. సరే అని రాజ్ సంతకం పెడతాడు. ఈ రోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.