Bigg Boss: పెళ్లికి ముందే.. బిగ్‌బాస్ బ్యూటీకి ప్రియుడి సర్ ప్రైజ్.. ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?

పెళ్లికి ముందే బిగ్ బాస్ బ్యూటీకి సర్ ప్రైజ్ ఇచ్చాడు కాబోయే భర్త. ఏకంగా కోట్ల రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.

Bigg Boss: పెళ్లికి ముందే.. బిగ్‌బాస్ బ్యూటీకి ప్రియుడి సర్ ప్రైజ్.. ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఎన్ని కోట్లంటే?
Subhashree Rayaguru

Updated on: Dec 21, 2025 | 2:16 PM

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శుభ శ్రీ రాయగురు కూడా ఒకరు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె బిగ్‌ బాస్‌ 7 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ప్రైవేట్‌ అల్భమ్స్‌ తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటిస్తూ బిజి బిజీగా ఉంటోందీ అందాల తార. అసలు విషయానికి వస్తే.. శుభశ్రీ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మరికొన్ని రోజుల్లో ప్రముఖ నిర్మాత, నటుడు అజయ్ మైసూర్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాగా శుభశ్రీ కాబోయే భర్త అజయ్‌ దగ్గర ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్ల కలెక్షన్స్‌ ఉన్నాయి. శుభశ్రీ తో నిశ్చితార్థం తర్వాత కూడా తన కార్ల కలెక్షన్స్‌ కూడా చూపించాడు. తాజాగా మరో లగ్జరీ బ్రాండ్‌ని తన గ్యారేజ్ లో చేర్చాడు అజయ్. కోట్ల రూపాయలు ఖరీదు చేసే బ్రాండ్‌ న్యూ మెర్సిడెస్‌ బెంజ్ కొనగోలు చేశాడు. అంతేకాదు ఈ కారును తనకు కాబోయే భార్య శుభశ్రీకి గిఫ్ట్‌ గా ఇచ్చాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

కొత్త కారుతో పాటు శుభశ్రీతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అజయ్ ‘ బ్లాక్ అండ్‌ వైట్‌ బోర్‌ కొట్టేసిందన్నాడు. అందుకే ఈ కారులో కారును కొని శుభశ్రీకి గిఫ్ట్ గా ఇచ్చానని తెలిపాడు. అంతేకాదు ఈ బ్రాండ్‌ తనకు ఇష్టమైనందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో కేవలం ఈ బ్రాండ్‌ కార్లు కేవం 20 ఉన్నాయని, అందులో ఇదోకటి అని చెప్పాడు. కాగా అజయ్- శుభశ్రీ కొన్న కారు గ్రీన్‌ కలర్‌లో.. ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త కారు ముందు శుభ శ్రీ రాయగురు- అజయ్

కాగా అజయ్‌.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్‌ డైరీస్‌, హ్యాంగ్‌మ్యాన్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే ప్రైవేట్‌ సాంగ్స్‌, పలు షార్ట్‌ ఫిలింస్‌లో నటించాడు.

శుభ శ్రీ రాయగురు లేటెస్ట్ ఆల్బమ్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.