Bigg Boss Telugu: సొంతింటి కలను సాకారం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. గృహ ప్రవేశంలో సెలబ్రిటీల సందడి.. వీడియో

సినిమా స్టార్స్ తో సమానంగా ఈ మధ్యన బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా లగ్జరీ ఇళ్లను కొనేస్తున్నారు. ఖరీదైన కార్లను తమ గ్యారేజ్ లోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీ తన సొంతింటి కలను సాకారం చేసుకుంది. వేడుకగా గృహ ప్రవేశం కూడా నిర్వహించింది.

Bigg Boss Telugu: సొంతింటి కలను సాకారం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. గృహ ప్రవేశంలో సెలబ్రిటీల సందడి.. వీడియో
Bigg Boss Telugu Rj Kajal

Updated on: May 27, 2025 | 3:09 PM

బిగ్‌బాస్ రియాలిటీ షోతో సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. హౌస్ నుంచి బయటకు రాగానే సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా టీవీ షోలు, ప్రోగ్రామ్స్ తో మంచి గానే సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా బాగానే ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ మధ్యన బిగ్ బాస్ కు సంబంధించి రోహిణీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక విశాలమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ ఆర్జే కాజల్ తన సొంతింటి కలను సాకారం చేసుకుంది. తాజాగా ఆమె కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. వేడుకగా నిర్వహించిన గృహ ప్రవేశం కార్యక్రమంలో బిగ్ బాస్ తారలు ప్రియాంక జైన్, సిరి హన్మంత్, సింగర్ లిప్సిక తదితరులు పాల్గొన్నారు. ఆర్జే కాజల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను సింగర్ లిప్సిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

‘ మీ ఈ సొంతింటి కలను నెర వేర్చుకునేందుకు నువ్వు ఎంత కష్ట పడ్డావో నాకు తెలుసు. నాకు మీ బాల్కనీ చాలా నచ్చింది. ఇక మీ ఇంటికి వచ్చి సెలెబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటాం’ అని లిప్సిక చెప్పుకొచ్చింది. ఇక సిరి హన్మంతు మాట్లాడుతూ.. ‘ మేం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినా కలిసిన ప్రతీ సారి చాలా కొత్తగా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అదే ఫ్రెండ్ షిప్ అంటే.. మొత్తానికి సాధించావ్.. సొంత ఇంటి కోసం ఎన్నో కలలు కన్నావ్.. ఎంతో కష్టపడ్డావ్.. ఇప్పుడు సాకారం చేసుకున్నావ్.. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.. నువ్వు ఎప్పుడూ ఇలానే ఆనందంగా, సంతోషంగా ఉండాలి’ అని సిరి చెప్పుకొచ్చింది. దీనికి స్పందించిన ఆర్జీ కాజల్.. ‘థాంక్యూ సిరి.. నా జర్నీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రిప్లై ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆర్జే కాజల్ గృహ ప్రవేశం కార్యక్రమంలో సెలబ్రిటీలు..

ప్రస్తుతం ఆర్జే కాజల్ గృహ ప్రవేశం కార్యక్రమానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాజల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

వెబ్ సిరీస్ ప్రమోషన్లలో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.