
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవలే ముగిసింది. కామనర్ కోటాలో హౌస్ లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సీరియల్ నటి తనూజ రెండో ప్లేసులో నిలిచింది. డిమాన్ పవన్ మూడో ప్లేసులో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచారు. కన్నడ హీరోయిన్ సంజనా గల్రానీ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు కల్యాణ్ బిగ్ బాస్ టైటిల్ గెలవడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. పలువురు మాజీ కంటెస్టెంట్స్ కల్యాణ్ కు పీఆర్ టీమ్స్ గా మారిపోయాయని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పుడిదే విషయంపై సంజనా గల్రానీ, గీతూ రాయల్ లు గొడవపడుతున్నారు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే..బిగ్‌బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది. ఆ వీడియోలో సంజన బిగ్‌బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై తనూజ, ఇమ్ము, డీమాన్ పవన్‌ల ఆట గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్ హైలెట్ అయ్యాడన్నాడు. దీనిని కొందరు నెటిజన్లు బాగా వైరల్ చేశారు. కల్యాణ్ కోసం ఆదిరెడ్డి, రీతూ రాయల్ లను ఓట్ల బిచ్చగాళ్లు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు జత చేశారు.
ఇదే వీడియోను సంజన కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో గీతూ రాయల్ అగ్గిమీద గుగ్గిలమైంది. వెంటనే సంజనాకు కౌంటర్ గా ఆమె కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్‌ను గీతూ పోస్ట్ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ కొద్దిసేపటి తర్వాత సంజన తన పోస్ట్‌ను తొలగించింది. ఆ తర్వాత గీతూ రాయల్ కూడా తను షేర్ చేసిన వీడియో పోస్ట్‌ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది వాటిని స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Sanjana, Geetu Royal Posts
#GeetuRoyal status on #Sanjana #BiggBossTelugu9 pic.twitter.com/kLMBYZfGBe
— TeluguBigg (@TeluguBigg) December 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.