
సుమారు మూడు నెలలుగా తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు మరికొన్ని గంటల్లో ఎండ కార్డ్ పడనుంది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తనూజ, కల్యాణ్ లలో ఎవరో ఒకరు ఈసారి బిగ్ బాస్ కప్పు అందుకోనున్నారని తెలుస్తోంది. కాగా శనివారం (డిసెంబర్ 20) నాటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్, సంజన బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్ గా ఆడియెన్స్ మనసులు గెల్చుకున్న ఇమ్మాన్యుయేల్ తక్కువ ఓటింగ్ కారణంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతని అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు. విన్నర్ అవ్వాల్సిన వాడిని టాప్-3లో కూడా లేకుండా చేశారని, ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం ఆడిస్తోన్న నాటకమని మండిపడుతున్నారు. కాగా టాప్-3 లో నిలవకున్నా ఇమ్మాన్యుయేల్ కు అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకి రూ.35వేలు, వారానికి రూ.2.25లక్షల చొప్పున భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం 15 వరాలకు గానూ ఇమ్మాన్యుయేల్ సుమారు రూ.33,75, 000 వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభిస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే ఇమ్మూ విన్నర్ ప్రైజ్ మనీకి దగ్గరగా బాగనే సంపాదించాడని తెలుస్తోది.
ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విషయానికి వస్తే.. తనూజ, కల్యాణ్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈ రెండ్రోజుల నుంచి డిమాన్ పవన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఓటీంగ్ లో అతని ప్రభావం బాగా కనిపించింది. ఈ కారణంగానే ఇమ్మాన్యుయేల్ ను సైతం అధిగమించి మరీ టాప్-3లోకి వచ్చేశాడు. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ గా నిలుస్తారనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్టుగా మాస్ మహారాజ రవితేజ రానున్నట్లు తెలుస్తోంది.
A lovely song by the music band, straight from the heart 💕
Watching Thanuja’s face light up with happiness says it all.
These are the moments that touch the soul and stay forever ✨🎵#Thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 #BiggBoss9Telugu pic.twitter.com/ftUO9Qm1SN— THANUJA PUTTASWAMY (@ThanujaP123) December 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.