Bigg Boss Telugu 6 Launch Highlights: గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 6 .. ఇస్మార్ట్ జోడీ అడుగుపెట్టింది..

|

Sep 04, 2022 | 10:12 PM

BB6 Grand Opening Live Updates: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌6 ప్రారంభమైంది. మూడో సీజన్‌ నుంచి హోస్ట్‌గా అలరిస్తోన్న అక్కినేని నాగార్జున ఈసారి మరింత ఎనర్జిటిక్‌గా మన ముందుకొచ్చారు.

Bigg Boss Telugu 6 Launch  Highlights: గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 6 .. ఇస్మార్ట్ జోడీ అడుగుపెట్టింది..
Bigg Boss 6 Telugu

Bigg Boss Telugu 6 Launch Highlights: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌6 ప్రారంభమైంది. మూడో సీజన్‌ నుంచి హోస్ట్‌గా అలరిస్తోన్న అక్కినేని నాగార్జున ఈసారి మరింత ఎనర్జిటిక్‌గా మన ముందుకొచ్చారు. ఈసారి సుమారు 106 రోజుల పాటు ఈ షో సాగనుందని సమాచారం. అలాగే తొలిసారిగా స్టార్‌మా ఛానెల్‌తో పాటు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. స్టార్ మా ఛానెల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. మరి ఈసారి ఎవరెవరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారో, వారి అనుభవాలను బిగ్‌బాస్‌ లైవ్ ముచ్చట్లలో తెలుసుకుందాం రండి.

ఈసారి మరింత స్పెషల్ గా..

ఈసారి బిగ్ బాస్  హౌస్ గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది.  డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్.. ఇలా ప్రతీది కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Sep 2022 09:48 PM (IST)

    ఆఖరి కంటెస్టెంట్‌గా స్టార్‌ సింగర్‌..

    రేవంత్‌.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాలో మనోహరి పాటతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. అంతుకుముందు ఇండియన్‌ ఐడల్ టైటిల్‌తో నేషనల్‌ లెవెల్‌లో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. 200కు పైగా పాటలు పాడిన ఘన అతని సొంతం. గతంలో పలు టీవీ షోల్లో పాల్గొని వినోదం పంచిన రేవంత్ బిగ్‌బాస్‌ లో ఎలాంటి ఫన్‌ అందిస్తాడో చూడాలి..

     

  • 04 Sep 2022 09:40 PM (IST)

    ఇస్మార్ట్‌ ఫేమ్‌ అంజలి ఎంట్రీ..

    టీవీ9లో ప్రసారమవుతోన్న ఇస్మార్ట్‌ న్యూస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆమె కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌తో బాగా గుర్తింపు సొంతం చేసుకుంది. మాటల ప్రవాహంతో ఆకట్టుకునే అంజలి బిగ్‌బాస్‌లో ఏమేర అలరిస్తుందో చూడాలి.

  • 04 Sep 2022 09:33 PM (IST)

    19వ కంటెస్టెంట్‌గా రాజశేఖర్‌

    మోడల్‌కు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్‌బాస్‌తో ఆ లోటును తీర్చుకుంటానంటున్నాడు రాజశేఖర్‌. కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్‌తో పాటు అడవి శేష్‌ నటించిన మేజర్‌ సినిమాలోనూ రాజశేఖర్‌ నటించాడు. ఇతను బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీకి క్లోజ్‌ ఫ్రెండ్‌.

  • 04 Sep 2022 09:29 PM (IST)

    18వ హౌస్‌మేట్‌గా కామన్‌ మెన్‌ ఆదిరెడ్డి..

    బిగ్‌బాస్‌ రివ్యూలతో ఒక్కసారిగా బాగా పాపులర్‌అయ్యాడు ఆదిరెడ్డి. సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి తనదైన విశ్లేషణలు అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి కామన్‌ మ్యాన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతని స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు.

  • 04 Sep 2022 09:21 PM (IST)

    సొంత ఇల్లు కట్టుకోవడమే నా ధ్యేయం..

    పటాస్‌ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది లేడీ కమెడియన్‌ ఫైమా. ఆతర్వాత జబర్దస్త్‌ షోలో తనదైన కామెడీ టైమింగ్‌తో అనతికాలంలోనే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. కాగా టీవీ షోల్లో తనదైన కామెడీ పంచులు పేల్చే ఫైమా బిగ్‌బాస్‌ స్జేజిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేసింది. మరో జబర్దస్త్‌ కమెడియన్‌ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్‌గా అంగీకరించింది. 35 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే తన ఫ్యామిలీకి సొంత ఇల్లు కట్టాలనే తన ధ్యేయమని బిగ్‌బాస్‌ వేదికగా చెప్పుకొచ్చిందీ లేడీ కమెడియన్‌.

  • 04 Sep 2022 09:07 PM (IST)

    ఆర్జీవీ బ్యూటీ వచ్చేసింది..

    డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన ఒకే ఒక్క డ్యాన్స్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయింది ఇనయా సుల్తానా. ఇటీవల విడుదలైన బుజ్జీ ఇలారా సినిమాలోనూ ఒక కీలక పాత్రలో నటించింది. మరి15 వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ఇనాయా ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

  • 04 Sep 2022 09:03 PM (IST)

    డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తానంటోన్న ఆర్జే సూర్య

    కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య బిగ్‌బాస్‌ 16వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆర్జే సూర్య మిమిక్రీ ఆర్టిస్టుగా పలు షోల్లో పార్టిసిపేట్‌ చేశాడు. అలాగే గరుడ వేగ, గుంటూరు టాకీస్‌ తదితర చిత్రాల్లోనూ నటించాడు. ఇక టీవీ9 ఛానెల్‌లో ప్రసారమవుతోన్న ఇస్మార్ట్‌ న్యూస్‌ ప్రోగ్రామ్‌లో కొండబాబుగా బోలెడు వినోదం పంచుతున్నాడు. డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తానంటూ బిగ్‌బాస్‌ హౌస్లోకి అడుగుపెట్టిన కొండబాబు ఏమేర అలరిస్తాడో చూడాలి.

  • 04 Sep 2022 08:54 PM (IST)

    14వ కంటెస్టెంట్‌గా జడ్చర్ల నటుడు..

    2003లో రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు షానీ. ఇతనిది మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల స్వస్థలం. అథ్లెటిక్‌గా నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ అయిన షానీ క్మంగా నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెరిశాడు. ఇక 2021లో వచ్చిన రామ్‌ అసుర్‌ చిత్రంలో శివన్నగా మెప్పించాడు. మరి బుల్లితెరపై ఎలాంటి వినోదం అందిస్తాడో చూడాలి.

  • 04 Sep 2022 08:36 PM (IST)

    నా డ్రీమ్‌ బాయ్‌ అలా ఉండాలి..

    నటి వాసంతి కృష్ణన్‌ 13 వ హౌస్‌మేట్స్‌గా ఎంట్రీ ఇచ్చింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతీ ఆతర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో నటించింది. సిరిసిరి మువ్వలు ధారావాహికతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌కు పరిచయమైంది. ఇటీవల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షనలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడులోనూ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సందర్భంగా తన డ్రీమ్‌బాయ్‌ క్వాలిటీస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందీ అందాల తార.

  • 04 Sep 2022 08:31 PM (IST)

    12వ కంటెస్టెంట్‌గా బాలాదిత్య..

    చంటిగాడు సినిమాతో ఆకట్టుకున్నాడు బాలాదిత్య. అంతకుముందు చైల్ట్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, జంబలకిడిపంబ, హిట్లర్‌, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్‌, సమరసింహా రెడ్డి తదితర సినిమాల్లో అతని నటనకు అందరూ ఫిదా అయ్యారు. చంటిగాడితో పాటు1940లో ఒక గ్రామం, భద్రాద్రి సహా 10 సినిమాల్లో హీరోగా బాలాదిత్య నటించాడు.

  • 04 Sep 2022 08:14 PM (IST)

    11వ కంటెస్టెంట్‌గా రోహిత్‌ సహ్నీ..

    కాగా మెరీనా భర్త రోహిత్‌ సహ్నీ బిగ్‌బాస్ 11వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. నీలికలువలు, అభిలాష సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు రోహిత్. 2015లో చిరు గొడవలు అనే సినిమాలోనూగా నటించాడు. రోహిత్‌, మెరీనాలు ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో కలుసుకున్నారు. అప్పుడే ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు.

  • 04 Sep 2022 08:03 PM (IST)

    అమెరికా అమ్మాయి వచ్చేసింది..

    అమెరికా అమ్మాయి సీరియల్‌తో పాపులర్ అయింది మెరీనా అబ్రహం. ఆ సీరియల్‌లో సమంతా కళ్యాణిగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఉయ్యాల జంపాలా ధారావాహికతోనూ మెప్పించింది. కొన్ని చిన్న సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డుల్లో ఒకరిగా నిలిచిందీ ట్యాలెంటెడ్ బ్యూటీ.

  • 04 Sep 2022 07:49 PM (IST)

    తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయశ్రీ..

    అల్లు అర్జున్‌ నటించిన ఆర్య సినిమాలో అ..అంటే అమలాపురం పాటతో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది అభినయశ్రీ. ఆతర్వాత కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ మెప్పించింది. కొన్ని స్పెషల్‌ సాంగ్‌ల్లోనూ సందడి చేసింది. మరి బిగ్‌బాస్‌ హౌస్లో ఎంతమేర ఆకట్టుకుందో చూడాలి.

  • 04 Sep 2022 07:39 PM (IST)

    బేబి వాయిస్‌తో అదరగొట్టిన గీతూ..

    బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన గీతూ రాయల్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా బొమ్మరిల్లు సినిమా విడుదల సమయంలో ఓ రోడ్డు ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడ్డానంటూ, గజినీగా మారిపోయానంటూ అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా తనలో ఉన్న మరో ట్యాలెంట్‌ బేబీ వాయిస్‌తోనూ అదరగొట్టిందీ ట్యాలెంటెడ్‌ బ్యూటీ. నాకు అఖిల్‌ భావ అంటే ఇష్టం.. అమల అత్తయ్య అంటే గౌరవమంటూ డైలాగులు పేల్చి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.

  • 04 Sep 2022 07:36 PM (IST)

    హౌస్‌లోకి చిత్తూరు చిరుత గీతూరాయల్‌..

    గీతూ రాయల్‌.. జబర్దస్త్‌ చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తనదైన హాస్యంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ట్యాలెంటెడ్‌ నటి బిగ్‌బాస్‌ ఎనిమిదో కంటెస్టెంటుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

  • 04 Sep 2022 07:33 PM (IST)

    డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ కల్యాణ్‌

    బిగ్‌బాస్‌ మరో కంటెస్టెంట్‌గా హీరో అర్జున్ కళ్యాణ్‌ డ్యాన్స్‌ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇతను కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించాడు.

  • 04 Sep 2022 07:28 PM (IST)

    ఆరో కంటెస్టెంట్‌గా శ్రీ సత్య..

    బిగ్‌బాస్ ఆరో కంటెస్టెంట్‌గా బుల్లితెర నటి శ్రీ సత్య ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి రాగానే తాను సింగిల్ అని సత్య చెప్పడంతో హౌస్‌లోకి వెళ్లి మింగిల్ అవ్వమని పంచ్‌ పేల్చారు నాగార్జున

  • 04 Sep 2022 07:08 PM (IST)

    చలాకీ చంటీ వచ్చేశాడుగా..

    బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు చలాకీ చంటి. తనదైన హాస్యంతో ఆకట్టుకునే ఈ నటుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.

  • 04 Sep 2022 06:54 PM (IST)

    మళ్లీ తెలుగులో పాట పాడిన అలియా..

    బ్రహ్మాస్త్ర సినిమా హీరో, హీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు తెలుగులో నమస్కారం చెప్పి ఆకట్టుకున్నాడు చాక్లెట్‌ బాయ్‌. ఇక అలియా బ్రహ్మాస్త్ర సినిమాలోని ఓ పాటను తెలుగులో అద్భుతంగా ఆలపించి అలరించింది.

  • 04 Sep 2022 06:44 PM (IST)

    నాలుగో కంటెస్టెంట్‌గా నేహా చౌదరి

    నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరి అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చింది. యాంకర్‌గా పరిచయమైన నేహా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ముఖ్యంగా ఐపీఎల్ చూసే వారికి  ఆమె బాగా గుర్తుంటుంది.

  • 04 Sep 2022 06:33 PM (IST)

    చిల్‌ బ్రో అంటూ సిరి బాయ్‌ ఫ్రెండ్‌ ఎంట్రీ..

    గతేడాది బిగ్‌బాస్‌ హౌస్‌ లో సిరి చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఈసారి ఆమె బాయ్‌ ఫ్రెండ్ శ్రీహాన్‌ చిల్‌ బ్రో అంటూ ఎంట్రీ ఇచ్చాడు.

  • 04 Sep 2022 06:27 PM (IST)

    నువ్వునాకు నచ్చావ్‌ పింకీ వచ్చేసిందిగా..

    నువ్వునాకు నచ్చావ్‌ సినిమాలో పింకీ పాత్రలో సందడి చేసిన పింకీ అలియాస్ సుదీప రెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టింది.  చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో నటించింది సుదీప. పెళ్లయిన తర్వాత కూడా  సుదీప పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించి మెప్పించింది.

  • 04 Sep 2022 06:19 PM (IST)

    మొదటి కంటెస్టెంట్‌గా కార్తిక దీపం ఫేమ్‌ కీర్తి..

    కార్తీకదీపం సీరియల్‌లో హిమ పాత్రలో కనిపించిన కీర్తి భట్‌ మొదటి కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టింది. అంతకుముందు ‘మనసిచ్చి చూడు’ సీరియల్‌తో కూడా బాగా పాపులర్ అయిందీ అందాల తార

     

  • 04 Sep 2022 06:12 PM (IST)

    అదిరిపోయిన నాగ్ ఎంట్రీ..

    అక్కినేని నాగార్జున బంగర్రాజు పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నా తరువాతేరా అంటూ నాగార్జున పంచ్ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చారు.  ఆ తరువాత మోడల్స్‌తో కలిసి చిందులు వేశారు నాగార్జున.  ఆ తర్వాత  బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రత్యేకతలను అందరికీ వివరించారు.

Follow us on