బిగ్ బాస్ తెలుగు 6 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ తామే విన్నర్ అవుతామని.. ట్రోఫీని అందుకుంటామని బలంగా నమ్ముతున్నారు. అన్ని సోషల్ మీడియా పోర్టల్స్‌లో సింగర్ ఎల్వీ రేవంత్ విన్నర్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. రన్నరప్ శ్రీహన్ అంటున్నారు. ఫైనలిస్ట్‌ల తుది స్థానాలపై మాకు ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. అదేంటో దిగువన తెలుసుకుందాం పదండి.
మాకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎల్‌వి రేవంత్ లేదా శ్రీహాన్‌లలో ఒకరు బిగ్ బాస్ తెలుగు 6 ట్రోఫి అందుకునే చాన్స్ ఉంది. అన్ అఫీషియల్ పోల్స్ ఓట్ల విషయానికి వస్తే ఈ ఇద్దరు మధ్యే గట్టి పోటీ ఉంది. 3, 4, 5 స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆది రెడ్డి 3వ స్థానానికి ఎగబాకగా, కీర్తి భట్ 4వ స్థానం, రోహిత్ సాహ్ని 5వ స్థానం దక్కించుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ ఫినాలేకి సన్నాహాలు పూర్తయ్యాయి. దీని కోసం భారీ సెట్‌ని వేసినట్లు సమాచారం. ఫినాలే ఎపిసోడ్‌లో కొంతమంది సెలబ్రిటీలు స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ప్రభాస్, రవితేజ, శ్రీకాంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 6 విజేత విలువైన ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. దానికి తోడు, స్పాన్సర్‌లు వారికి మారుతీ కారు, 650 చదరపు గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందజేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..