Bigg Boss Season 6: బిగ్‏బాస్ ఇంట్లో మోడల్ రాజశేఖర్.. ఎవరో తెలుసా ?..

|

Sep 06, 2022 | 8:44 PM

ఇక ఇప్పుడు అదే కేటగిరిలో ఇంట్లోకి అడుగుపెట్టాడు మోడల్ రాజశేఖర్. మోడల్ గా తమకంటూ స్థానం సంపాదించుకున్న రాజశేఖర్ .. జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోన్నారు.

Bigg Boss Season 6: బిగ్‏బాస్ ఇంట్లో మోడల్ రాజశేఖర్.. ఎవరో తెలుసా ?..
Model Rajasekar
Follow us on

అతి పెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 6 తెలుగులో ఘనంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 4న షూరు అయిన షోలోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో షోస్, సీరియల్స్, సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం ఉన్నవారు కొందరు కాగా.. మరికొందరు అస్సలు జనాలకు తెలియని వారున్నారు. ఇక బిగ్‏బాస్ తెలుగు 18వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మోడల్ రాజశేఖర్ ప్రేక్షకులకు పరిచయం లేదు. మోడల్‏గా క్రేజ్ ఉన్నప్పటికీ చాలా మందికి ఇతను ఎవరో తెలియకపోవచ్చు. ఇక గత సీజన్లో మోడల్ జెస్సీ సైతం బిగ్‏బాస్ షో ముందు వరకు చాలా మందికి తెలియదు. కానీ బిగ్‏బాస్ ఇంట్లో తన ఆట తీరుతో బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు అదే కేటగిరిలో ఇంట్లోకి అడుగుపెట్టాడు మోడల్ రాజశేఖర్. మోడల్ గా తమకంటూ స్థానం సంపాదించుకున్న రాజశేఖర్ .. జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోన్నారు.

చిన్నవయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబభారం రాజశేకర్ పై పడింది. జీవితంలో మోడల్ కాక ముందు ఆఫీస్ భాయ్ గా పనిచేశారు. అక్కడ ఎంతోమంది పెద్దవాళ్లతో పనిచేసే క్రమంలో తనకి జాబ్, లైఫ్ సెట్ కావని డిసైడ్ అయ్యాడు. దీంతో మోడల్ వైపు అడుగులు వేశారు. అలా మోడలింగ్ రంగంలో కదలికలు నేర్చుకున్నారు. అందం, ఎత్తు..ఫిట్ నెస్ ఉండడంతో మోడల్ గా కెరీర్ లో మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మోడల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో తనను తాను నిరూపించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. తాను చేయబోయే సినిమా కోసం బిగ్‏బాస్ రియాల్టీ షో తనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తుందనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చాడు మోడల్ రాజశేఖర్. అయితే ఇప్పటివరకు షోలో ఈ మోడల్ స్క్రీన్ పై కనిపించింది చాలా తక్కువ.

ఇవి కూడా చదవండి


మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.