Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వాయిదా పడుతోందా ?.. నెట్టింట్లో టాక్.. ఆ పోస్టర్‏తో రూమర్లకు చెక్..

|

Sep 02, 2021 | 7:28 AM

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 సందడి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా బిగ్‏బాస్ షోకు సంబంధించి కథనాలు, రూమర్స్, గాసిప్పులు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వాయిదా పడుతోందా ?.. నెట్టింట్లో టాక్.. ఆ పోస్టర్‏తో రూమర్లకు చెక్..
Bigg Boss 5
Follow us on

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 సందడి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా బిగ్‏బాస్ షోకు సంబంధించి కథనాలు, రూమర్స్, గాసిప్పులు ఇలా ఒక్కటేమిటీ ప్రతి అప్డేట్ తెగ వైరల్ అవుతుంది. ఇక బిగ్‏బాస్ షో వస్తుందంటే బుల్లితెరపై సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో అప్డేట్ రాకముందే నెట్టింట్లో జోష్ మొదలైంది. ఇక ఈ రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ సెప్టెంబర్ 5న సాయంత్రం బిగ్‏బాస్ షో స్టార్ట్ కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీంతో గత కొద్ది రోజులుగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతున్నాయి. ఇందులో ఇప్పటికే ఎంతో మంది పేర్లు వినిపించారు. అందులో లోబో, ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, రిసి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్థస్త్ ఫేమ్ ట్రాన్స్‏జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, సీరియర్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య, లహరి రాబోతున్నట్లుగా ఓ లీస్ట్ ముందుగా చక్కర్లు కొట్టింది. అయితే అందులో పలుమార్లు మార్పులు జరిగాయి. ఇటీవల కొత్త కొత్త పేర్లు వినిపించాయి. తాజాగా నటుడు విశ్వ, యూట్యూబర్ సరయు, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సింగర్ శ్రీరామచంద్ర వంటి పేర్లు లిస్ట్‏లో వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఇద్దరు కంటెస్టెంట్స్ కరోనా భారీన పడ్డారని.. వారిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారని.. మిగతా సభ్యులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. కరోనా కారణంగా.. బిగ్‏బాస్ షో వాయిదా పడే అవకాశం ఉందని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లుగా టాక్ వచ్చింది. అయితే అవన్నీ రూమర్లేనంటూ తాజాగా విడుదలైన పోస్టర్ ద్వారా అర్థమవుతుంది. బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉందని పోస్టర్ విడుదల చేయగా.. ఇటీవల రూమర్లకు చెక్ పెట్టారు నిర్వహకులు.. మొత్తానికి బిగ్‏బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న సాయంత్రం ప్రారంభం కాబోతుంది.

Also Read: Currency Note: ఈ ‘నెంబర్’ కలిగిన కరెన్సీ నోటు మీ వద్ద ఉందా? అయితే రూ. 3 లక్షలు మీ సోంతమైనట్లే..

Hyderabad: జలసౌధలో హాట్‌ హాట్‌గా సుధీర్ఘ సమావేశం.. ఫైనల్‌గా నీటి పంపకాలపై ఏం తేల్చారంటే..