Bigg Boss Kaushal: దీప్తి సునయన నన్ను ఆ మాటలు అంది.. అప్పుడే ఫిక్సయ్యా.. బిగ్‏బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్.

|

Feb 07, 2022 | 4:56 PM

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఒకరిద్దరికి ఈ షో చేదు అనుభవాలను మిగిల్చిన చాలా మందికి మాత్రం ఎక్కువగానే పాపులారిటీని తెచ్చిపెట్టింది.

Bigg Boss Kaushal: దీప్తి సునయన నన్ను ఆ మాటలు అంది.. అప్పుడే ఫిక్సయ్యా.. బిగ్‏బాస్ కౌశల్ షాకింగ్ కామెంట్స్.
Kaushal
Follow us on

బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఒకరిద్దరికి ఈ షో చేదు అనుభవాలను మిగిల్చిన చాలా మందికి మాత్రం ఎక్కువగానే పాపులారిటీని తెచ్చిపెట్టింది. అందులో బిగ్‏బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ (Kaushal) ఒకరు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను చేరువైన కౌశల్.. అదే పాపులారిటీతో బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ షోలో కౌశల్‏తో ఎవరికీ పడేది కాదు. షోలో ఉన్నంతవరకు అందరు సామాన్యంగా కౌశల్‏ను దూరం పెట్టేవారు. అయినా.. తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా ఉండి.. బిగ్‏బాస్ సీజన్ 2 విన్నర్ అయ్యాడు. ఈషోతో కౌశల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల అతడు.. ఆమె.. ప్రియుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‏బాస్ షో గురించి..అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు కౌశల్.

కౌశల్ మాట్లాడుతూ.. బిగ్‏బాస్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎవరికీ నచ్చేది కాదు.. అందుకు కారణం నా ముక్కుసూటితనం. ఇదే కారణంతో నాకు సినిమా అవకాశాలు కూడా రాలేదు. నాకు చాలా యాటిట్యూడ్ ఉందని అనుకుంటారు. నాకు సినిమా అవకాశం ఇవ్వమని నేరుగా వెళ్లి డైరెక్టర్ ను అడుగుతా.. చేద్దాం అంటే.. నాకేందుకు ఇవ్వరు అని అడుగుతా.. అంతేకానీ.. కాళ్లు పట్టుకుని కాకాపట్టే నేచర్ నాది కాదు. నా ముక్కుసూటితనం వలన ఎవరికీ నేను నచ్చను. ఇదే కారణంతో బిగ్‏బాస్ ఇంట్లో కూడా నేను ఎవరికీ నచ్చలేదు. అయినా నేను పట్టించుకోలేదు. కానీ నా గురించి నెగిటివ్‏గా మాట్లాడితే నచ్చదు. నా అనుభవం అంత వయసు లేని దీప్తి సునయన.. నన్ను ఒక మాట అన్నది. కౌశల్ రెండు వారాల్లోనే వెళ్లిపోతాడని దీప్తి సునయన అన్నది. నాకు ఆ వీడియోను నాని గారు ఎప్పుడైతే చూపించారో అప్పుడే డిసైడ్ అయ్యాను.. నేనేంటో చూపించాలని. వాళ్లకే కాదు.. ప్రపంచానికి సైతం నేనేంటో చూపించాలనుకున్నాను.. రెండో వారంలోనే వెళ్లిపోతానని నా ప్రోమో కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఓటింగ్ మరో గంటలో క్లోజ్ అవుతుందనగా.. ఆ నిమ్మకాయ నా కళ్లలోకి పిండే ఎపిసోడ్ రావడంతో.. నా రాత పూర్తిగా మారిపోయింది. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ కాకపోయి ఉంటే.. నేను నిజాంగానే రెండో వారంలో ఎలిమినేట్ అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు కౌశల్.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)