Bigg Boss 15: బిగ్‏బాస్ టైటిల్ మరోసారి మహిళకే.. సీజన్ 15 విజేత ఎవరంటే..

|

Jan 31, 2022 | 7:51 AM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss). ఈ షోకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి విపరీతమైన

Bigg Boss 15: బిగ్‏బాస్ టైటిల్ మరోసారి మహిళకే.. సీజన్ 15 విజేత ఎవరంటే..
Bigg Boss 15
Follow us on

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ (Bigg Boss). ఈ షోకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ అందుతోంది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో బిగ్‏బాస్ రియాల్టీ షో సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. బిగ్‏బాస్ సీజన్ 5 తెలుగు విజేతా విజే సన్నీ గెలివగా.. రన్నరప్‏గా యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. హిందీలో బిగ్‏బాస్ రియాల్టీ షో 1 (Bigg Boss Season 15) సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది.

ఇప్పటివరకు హిందీలో బిగ్‏బాస్ రియాల్టీ షో 14 సీజన్లు ముగిశాయి. ఇక నిన్న ఆదివారం (జనవరి 31న) బిగ్‏బాస్ సీజన్ 15 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఇక ఈసారి బిగ్‏బాస్ టైటిల్ మరోసారి మహిళకే దక్కడం విశేషం. ఎంతో ఉత్కంఠంగా సాగిన సీజన్ 15 గ్రాండ్ ఫినాలేలో బుల్లితెర నటి తేజస్వి ప్రకాష్ బిగ్‏బాస్ విజేతగా నిలిచింది. ఇక మోడల్.. నటుడు ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్ అయ్యాడు. బిగ్‏బాస్ విజేతగా మహిళ నిలవడం ఇది మొదటి సారి కాదు. సీజన్ 12 విజేతగా దీపికా కాకర్ నిలవగా.. సీజన్ 13 నటుడు సిద్ధార్థ్ శుక్లా విన్నర్ అయ్యాడు. ఇక సీజన్ 14 బుల్లితెర నటి రుబినా దిలక్ బిగ్‏బాస్ విన్నర్ కాగా.. సీజన్ 15 టైటిల్ కూడా బుల్లితెర నటినే వరించింది.

Bigg Boss

ఇక బిగ్‏బాస్ సీజన్ 15లో నటుడు కరణ్ కుంద్రా మూడో స్థానంలో నిలవగా.. నటి షమితా శెట్టి నాల్గవ స్థానంలో.. కొరియోగ్రాఫర్ నిశాంత్ భట్ ఫైనల్ నుంచి తప్పుకుని రూ. 10 లక్షలు తీసుకున్నాడు. బిగ్‏బాస్ సీజన్ 15 విజేత తేజస్వీ ప్రకాష్ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాకుండా..స్వరాగిణి సీరియల్ ద్వారా తేజస్వీ ప్రకాష్ ఎక్కువగా పాపులారిటీ సంపాందించుకుని బిగ్‏బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Bhala Thandanana: యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది ‘భళా తందనాన’ టీజర్

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?