Ashu Reddy: ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేసిన ఆషు రెడ్డి.. గిఫ్ట్ ఎంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..

|

Sep 22, 2021 | 7:37 PM

బిగ్‏బాస్ షో తర్వాత అషురెడ్డి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ షో తర్వాత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తుంది.

Ashu Reddy: ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి మరీ లవ్ ప్రపోజ్ చేసిన ఆషు రెడ్డి.. గిఫ్ట్ ఎంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Ashu Reddy
Follow us on

బిగ్‏బాస్ షో తర్వాత అషురెడ్డి ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈ షో తర్వాత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. గతంలో రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి గురించి విభిన్న రకాలుగా టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే వీరిద్దరు ఫోటోస్ షేర్ చేస్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత.. ఇటీవల వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ నెట్టింట్లో రచ్చ చేసింది బిగ్‏బాస్ బ్యూటీ.

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో అషురెడ్డి.. ఎక్స్‏ప్రెస్ హరి మధ్య లవ్ స్టోరీ ఉందన్నట్లుగా స్క్రీప్ట్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఈ జంటకు కాస్త ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు అషురెడ్డికి ప్రపోజ్ చేస్తూ.. ఆమె ప్రేమ కోసం పరితపించే అబ్బాయిగా ఎక్స్‏ప్రెస్ హరి కనిపిస్తూ వచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే స్క్రిప్ట్స్, పర్ఫామెన్స్ కూడా నిజాంగానే ఈ జంట ప్రేమలో ఉన్నారన్నట్టుగానే ప్రేక్షకులకు ఫీల్ కలిగిస్తూ వచ్చారు. అంతేకాదు… వీరిద్దరి రిలేషన్ పై వస్తున్న వార్తలు నిజమే అన్నట్టుగా గతంలో హరి తన గుండెలపై.. అషు పేరును టాటుగా వేయించుకుని అందరికి షాక్ ఇచ్చాడు.

అయితే ఎప్పుడూ.. అషురెడ్డికి హరి ప్రేమ ప్రపోజల్ చేయడమే చూపించారు. షో జరుగుతన్న సమయంలోనే ఖరీదైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‏గా ఇచ్చి మరీ తన ప్రేమను తెలియజేసింది అషు. మరి నిజంగానే లవ్ ప్రపోజ్ చేసిందా ? లేదా ? కేవలం స్క్రిప్ట్‏లో భాగమేన అనేది మాత్రం తెలియరాలేదు. అలాగే నిజంగానే అషు అన్ని లక్షలు విలువ చేసే స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చిందా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక అషు ఇచ్చిన కానుక చూపి.. తెగ మురిసిపోయాడు హరి. ఇప్పటివరకు తన తల్లిదండ్రులు కూడా ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంటూ అషురెడ్డిని హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Also Read: Maestro Team celebrations Photos: సంబరాల్లో మునిగి తేలుతున్న మాస్ట్రో టీం… ఓటిటి లోనే ఇంత ఆదరణ…(ఫొటోస్)