Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

సాధారణ యాంకర్‏గా కెరీర్ ఆరంభించి.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ. ఇక ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయడంతో అరియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అదే క్రేజ్‏తో బిగ్‏బాస్‏లోకి ఎంట్రీ ఇచ్చి..

Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..
Ariyana

Edited By:

Updated on: Jul 12, 2021 | 5:27 PM

సాధారణ యాంకర్‏గా కెరీర్ ఆరంభించి.. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది అరియానా గ్లోరీ. ఇక ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయడంతో అరియానా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అదే క్రేజ్‏తో బిగ్‏బాస్‏లోకి ఎంట్రీ ఇచ్చి.. తన ఆట తీరుతో అబ్బాయిలకు కూడా గట్టి పోటీనిస్తూ.. ఫైనల్ వరకు వెళ్లింది అరియానా. ఇక బిగ్‏బాస్‏లోక అరియానా ఉన్న సమయంలో తనను గెలిపించాలంటూ ఆర్జీవి సైతం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు బిగ్‏బాస్‏ షోనే చూడని వర్మ.. అరియానాకు మద్దతు పలకడంతో వీరిద్దరి మధ్య సమ్‏థింగ్ సమ్‏థింగ్ ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ఆర్జీవిని ఇంటర్వ్యూను చేసిన అరియానా సైతం.. ఇదే విషయాన్ని నేరుగా వర్మను అడిగేసింది.

Ariyana Glory

ఇందుకు ఆర్జీవి స్పందిస్తూ.. ఫ్రెండ్ షిప్ అంటే తట్టుకోలేరు. వాడు అలాంటోడు.. ఇది ఇలాంటిది అని చెప్పకపోతే సోషల్ మీడియాలో ఉన్నవాళ్లకి నిద్ర పట్టదు. వాళ్ల మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదు అంటూ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. అయితే తాజాగా అరియానా తాను ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే అరియానా తాజాగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో ఒక నెటిజన్.. నువ్వు ప్రేమలో ఉన్నవా ? అని ప్రశ్నించగా.. అందుకు ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది ఈ అమ్మడు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా తనను తాను ఇష్టపడుతున్నాని.. మీరు కూడా అంతేనా అంటూ ఇన్‏స్టాగ్రామ్‏లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. అరియానాకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Also Read: Narappa: అఫీషియల్ అనౌన్స్ వచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‏లోనే వెంకటేష్ “నారప్ప”… విడుదల ఎప్పుడంటే..

Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..

Anaya Soni: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బుల్లితెర నటి.. సాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం..

Shruti Haasan: బాయ్‏ఫ్రెండ్‏తో కలిసి వంటగదిలో శ్రుతిహాసన్ రచ్చ.. కలిసి తినేవారే కలిసుంటారు అంటూ..