
ఎట్టకేలకు ఉత్కంఠగా సాగిన రేసులో బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా అవతరించాడు కళ్యాణ్ పడాల. వేలాది మందిలో సామాన్యుడిగా అగ్నిపరీక్ష షోలోకి అడుగుపెట్టిన కళ్యాణ్.. తన ఆటతో ముగ్గురు జడ్జీలను మెప్పించి సీజన్ 9లోకి ఫస్ట్ కామనర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి నెగిటివిటీ లేకుండా దాదాపు 105 రోజులపాటు తన ఆట తీరుతో కట్టిపడేసి.. చివరకు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన రేసులో స్వల్ప వ్యత్యాసంతో ట్రోఫీని ముద్దాడాడు. తనూజన రన్నరప్ గా నిలిచింది. అప్పటివరకు టెన్షన్ తో కనిపించిన కళ్యాణ్.. విజేతగా ప్రకటించడంతో ఆనందాన్ని తట్టుకోలేక మోకాళ్ల మీద నిల్చొని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత నాగార్జున కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు.
విజేతగా నిలిచిన కళ్యాణ్ కు ట్రోఫీతోపాటు రూ.35 లక్షల ప్రైజ్ మనీ చెక్, మారుతీ సుజుకీ కారు, రాఫ్ అడెసివ్ నుంచి రూ.5 లక్షల చెక్కు అందించారు నాగార్జున. తనూజ స్పీచ్ అనంతరం.. కళ్యాణ్ విన్నింగ్ స్పీచ్ తో మరోసారి అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. “అగ్నిపరీక్షకు వచ్చిన కొన్ని లక్షల అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ అయి ఇక్కడే ఆ షో కోసం కూర్చొన్నాం. ఇక్కడే షూటింగ్ జరిగింది. అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ టాస్కు జరిగినప్పుడు ఒక మాట చెప్పాను.. సోగ్గాడే చిన్ని నాయనా ప్రీ రిలీజ్ వేడుకలో మీరు చెప్పిన వస్తున్నాం కొడుతున్నాం అనే డైలాగ్ చెప్పాను. ఇప్పుడు కొట్టి చూపించాను. నా తల్లిదండ్రులు వాళ్లకు ఉన్నదానికంటే ఎక్కువే నన్ను పోషించారు. వాళ్ల స్థాయితో పోల్చుకుంటే నేను ఎక్కడో ఉండాలి. ఈరోజు ఇలా స్టేజ్ మీద ఉన్నానంటే వాళ్ల పెంపకమే సార్.. వాళ్లు లేకపోతే నేను లేను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. “నా ప్రియమైన అడియన్స్.. నేను ఫ్యాన్స్ అనను.. ఎందుకంటే నేను అంత సాధించానని అనుకోవడం లేదు. నన్ను ప్రేమించిన వాళ్లకు.. నన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు నా చేతిలోకి ఇది తీసుకువచ్చిన వాళ్లందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పాల్సినవాళ్లు చాలా మంది ఉన్నారు. ముందుగా థ్యాంక్స్ ప్రియ.. తర్వాత శ్రీజ.. లాస్ట్ లేడీ క్వీన్ తనూజకు థ్యాంక్స్. ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా.. కళ్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజ.. అది ఒప్పుకుంటా” అంటూ మరోసారి తన స్పీచ్ తో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..