Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం పదవ వారం నడుస్తుంది. అగ్నిపరీక్ష అంటూ మొదలైన ఈ షో.. చదరంగం కాదు రణరంగం అంటూ ముందు నుంచి హోస్ట్ నాగార్జున హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈషోకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూస్తూంటే జనాలు ఏ రేంజ్ లో షో ను ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తోంది.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
Bigg Boss

Updated on: Nov 12, 2025 | 8:34 PM

బిగ్ బాస్ సీజన్ 9.. రణరంగం అంటూ ముందు నుంచే హైప్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. మొత్తం 15 మందితో మొదలైన ఈ షో మొదటి నాలుగైదు వారాలు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముద్దమందారం సీరియల్ ఫేమ్ తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి, రీతూ చౌదరి, సుమన్ శెట్టి జనాలకు సుపరిచితమే. అలాగే అగ్నిపరీక్ష ద్వారా అప్పటికే ప్రేక్షకులకు దగ్గరయ్యారు కళ్యాణ్, శ్రీజ. ఇలాముందు నుంచి అగ్నిపరీక్ష అంటూ హడావిడి చేసిన టీమ్.. బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి నాలుగైదు వారాల్లో తనూజ, ఇమ్మాన్యూయేల్, సుమన్ శెట్టి, భరణి బంధాలు, కామెడీ టైమింగ్ జనాలను తెగ నచ్చేసింది. కానీ ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది.

ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..

దివ్య ఎంట్రీ తర్వాత వైల్డ్ కార్డ్స్ అంటూ ఆరుగురిని పట్టుకోచ్చారు. వచ్చామా.. గొడవ చేశామా అంటూ బిగ్ బాస్ హౌస్ లే సంతలా మార్చేశారు. పర్సనల్ అటాక్ చేస్తూ అనవసరమైన విషయాలు నానా హంగామా చేస్తూ జనాలకు విసుగుపుట్టించారు. దీంతో వచ్చిన వారానికే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ను బయటకు పంపించేశారు అడియన్స్. ఇప్పడు బిగా బాస్ సీజన్ 9 పదవ వారం నడుస్తుంది. అయినప్పటికీ కంటెస్టెంట్స్ బాండింగ్స్, ప్రేమకథలతో ప్రశాంతంగా గడిపేస్తున్నారు. అటు బిగ్ బాస్ సైతం ఈసారి అంతగా టాస్కులు ఏం పెట్టకుండా చూసి చూడనట్టు వదిలేయడంతో రిలాక్స్ అవుతున్నారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ మారింది.

Bigg Boss Telugu 9

43వ టీఆర్పీ రేటింగ్ చూస్తే అర్బన్, రూరల్ కలిపి 5.03 రేటింగ్ వచ్చింది. అంటే.. సీరియల్స్ కంటే తక్కువ అన్నమాట. కార్తీక దీపం 2 సీరియల్ కు 14.36, ఇల్లు ఇల్లాలు పిల్లలు 13.84, ఇంటింటి రామాయణం సీరియల్ 11.60, గుండె నిండా గుడిగంటలు 10.91 రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్, టీవీ షోల కంటే తక్కువగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే.. ఈ షో జనాలను ఎంతగా ఎంటర్టైన్ చేస్తుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం స్టార్ మాలో అత్యంత వరస్ట్ రేటింగ్ అంటే బిగ్ బాస్ షోకు వచ్చింది. ఇక ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అని ఫీక్సయ్యారు జనాలు. ఆమె తప్పు చేసినా హోస్ట్ నాగార్జున ప్రశ్నించకపోవడం.. అందరి కంటెస్టెంట్స్ కంటే తనూజకు స్క్రీన్ స్పెస్ ఇవ్వడం.. ఆమెకు ఎదురుతిరిగితే వెంటనే నెగిటివిటీ వచ్చేయడం ఏంటనీ విసుక్కుంటున్నారు జనాలు. ముందే విన్నర్ ఫిక్స్ అయ్యాకా.. ఇక షో చూడడం ఎందుకని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?