AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..

బిగ్‏బాస్ సీజన్ 9 మూడు వారాలు పూర్తి కాబోతుంది. ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ప్రస్తుతం 13 మంది హౌస్ లో ఉన్నారు. ఇందులో 8 మంది సెలబ్రెటీస్ కాగా.. మరో ఐదుగురు కామనర్స్. అయితే ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా మరో కామనర్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2025 | 6:59 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయం ఆసన్నమైంది. దీంతో ముందుగా కామనర్స్‏కు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దివ్య నికితా, అనూష్ రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్ లను హౌస్ లోకి పంపించారు. మీరు హౌస్ లో ఎందుకు ఉండాలి అనేది హౌస్మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఒక అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో నలుగురూ వాళ్ల స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యంగా అనూష రత్నం, దివ్య నికితా ఇద్దరూ దమ్ము శ్రీజకు దిమ్మతిరిగే షాకిచ్చారు. దీంతో ఆమె హర్టయ్యింది. వైల్డ్ కార్డ్ ఏదైన ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి అని చెప్పడంతో కామనర్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ముందుగా దమ్ము శ్రీజ పైకి లేచి మీరు హౌస్ లోకి రావాలనుకుంటే ఇక్కడున్నవాళ్లలో ఎవరిని స్వాప్ చేస్తారు.. ఎందుకు అంటూ అడిగింది. వెంటనే అనూష రత్నం మాట్లాడుతూ నేను అయితే నిన్నే స్వాప్ చేస్తాను శ్రీజ.. ఎందుకంటే నీ దగ్గర ఉన్నంత నెగిటివిటీ ఎవరి దగ్గరా లేదు. నీ ఇగో సాటిస్ ఫై అవ్వకపోతే పుండు మీదు పిన్నీస్ పెట్టి పొడిచినట్లు ఆ ఇష్యూని సాగదీస్తూనే ఉంటావ్ అంటూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఆ మాటలకు హర్ట్ అయ్యింది శ్రీజ. ఇక ఆ తర్వాత దివ్య నికితా సైతం శ్రీజను స్వాప్ చేస్తా అని చెప్పేసింది.

ఇక షాకీబ్, నాగ మాత్రం పవన్ కళ్యాణ్ ను స్వాప్ చేస్తామంటూ చెప్పారు. అగ్నిపరీక్షలో బాగా ఆడావ్.. కానీ ఇక్కడ గేమ్ కనిపించట్లేదు అని నాగ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఓవర్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఏంటీ నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా.. నా ఫ్రాంక్ నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా అంటూ కాలు మీద కాలేసుకొని డైలాగ్ చెప్పాడు. ఇక హౌస్మేట్స్ అందరూ నాగ పేరు అనుకున్నారు. కాసేపటికి బిగ్‏బాస్ ఓటింగ్ ఏర్పాటు చేశాడు. ఓటు వేయాల్సిన సమయం వచ్చింది. ఇద్దరు వ్యక్తుల ముఖాలపై టిక్ పెట్టి బ్యాలెట్ బాక్స్ లో వేయండి. మీరు ఎవరికి ఓటు వేశారో చెప్పకూడదు అని కండీషన్ పెట్టాడు. చివరకు బిగ్‏బాస్ మాట్లాడుతూ ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. ఇప్పుడు నా రిజల్ట్ చూడండి అంటూ డోర్స్ ఓపెన్ చేశాడు. దివ్య నికితా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చూడగానే అందరూ షాకరయ్యారు. ముఖ్యంగా కామనర్స్ ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి. ఇకపై దివ్య హౌస్మేట్స్.. టెనెంట్స్ లో ఒకరిగా ఉంటారు అంటూ బిగ్‏బాస్ చెప్పాడు.

ఇక ఇంట్లోకి వెళ్లిన దివ్య ముందుగా హౌస్మేట్స్ అడగడంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి లీక్ చేసింది. కళ్యాణ్, పవన్ మధ్యలో రీతూ అని పసిగట్టింది శ్రీజ. దీంతో కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఆమెను అసలు అమ్మాయిలాగే చూడను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాత్రి కెమెరాతో దివ్య మాట్లాడుతూ.. కావాలనే లవ్ ట్రాక్ గురించి చెప్పాను. నేను చెప్పగానే నలుగురు షేక్ అయ్యారు. ఇప్పుడు వాళ్ల బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటీ అనేది అడియన్స్ చూడాలి. అప్పుడు ఎవరు ఎంత జెన్యూన్ గా ఉన్నారు..ఎవరు ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు.. ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయో తెలుస్తుంది.. అందుకే ఒక రాయి వేశా అంటూ మాట్లాడింది దివ్య.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

Follow Us