
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో సత్తా చాటుతున్నాడు కళ్యాణ్ పడాల. కామన్ మెన్ కోటాలో హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యామ్.. ఇప్పుడు టైటిల్ రేసులో ముందున్నాడు. టాస్కులలో గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా తన మాట తీరుతో జనాల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు తనూజకు పోటీగా టైటిల్ కు అడుగు దూరంలో ఉన్నాడు. అయితే గత రెండు రోజులుగా కళ్యాణ్ పడాల మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అతడు ఆర్మీ కాదని.. అతడిని ఆర్మీ నుంచి తొలగించారంటూ ఓ ఆర్మీ జవాన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కళ్యాణ్ అసలు ఆర్మీ కదా అంటూ నెటిజన్స్ అవాక్కయ్యారు. అయితే ఇప్పుడు మరో జవాన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపాడు. కళ్యాణ్ ను అసలు ఆర్మీ నుంచి తీసేయలేదని.. అతడు రూల్స్ ప్రకారమే లీవ్ పెట్టి వచ్చాడని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
“జై హింద్ అందరికీ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడాలని వచ్చాను. ఆర్మీ నుంచి కళ్యాణ్ పడాలను రీమూవ్ చేయలేదు. అతడిని తీసేయలేదు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు . అవేవో ఫేక్ ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఆపాలనే మీ ముందుకు వచ్చాను. కళ్యాణ్ పర్మిషన్ తీసుకుని బిగ్ బాస్ లోకి వచ్చాడు. లెటర్ రాసి పెట్టేసే వచ్చాడు. ఒకవేల లీవ్ గురించి చెప్పాలంటే.. లీవ్స్ అన్నీ అయిపోయాయి. భార్య ప్రెగ్నెంట్ అయితే పంపిస్తారు. అమ్మనాన్నాలకు బాగోకోపోయినా పంపిస్తారు. ఎడ్యూకేషన్ పర్సన్ మీద ఎన్వోసీ ఉంటే ఎగ్జామ్ కు పంపిస్తారు. ఇలా లీవ్స్ ఎక్స్ టెన్షన్ ..లీవులు ఇచ్చే పద్దతులు ఉంటాయి. అవేవి లేకుండా కళ్యాణ్ రాలేదు. కళ్యాణ్ మాతోపాటే డ్యూటీ చేస్తున్నాడు. అతడిని రిమూవ్ చేయలేదు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. అతను ఇప్పటికీ ఫోర్స్ లోనే ఉన్నాడు. తనను రిమూవ్ చేయాలంటే తన సిగ్నేచర్ ఉండాలి. పదేళ్లలోగా రిమూవ్ చేయాలంటే ఒక సోల్జర్ నేను వెళ్లిపోవాలని అనుకుంటే తన ట్రైనింగ్ మీద ఖర్చుపెట్టిన మొత్తం కట్టేసి వెళ్లాలి. అంత ఈజీగా పంపించేయడం కుదురదు. ఇందుకు చాలా రూల్స్ ఉంటాయి. పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సోల్జర్ నుంచి రివీల్ కావాలంటే చాలా సంతకాలు చేయాలి. అన్నింటికి సెటిల్ మెంట్ చేసే వెళ్లాలి. తనను పంపించలేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ చెప్పొద్దు” అంటూ మణి అనే జవాన్ వీడియో షేర్ చేశారు.
” ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అని చెప్పుకుంటాడు. ఎలక్ట్రీషియన్ తన వర్కే చేస్తున్నడాని అంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేనొక సోల్జర్ అని బిగ్ బాస్ స్టార్టింగ్ లో చెప్పాడు కానీ.. ఇప్పటివరకు నేను సోల్జర్ ను నాకు ఓట్లేయండి అని ఎక్కడ అడగలేదు. బిగ్ బాస్ లో తన గేమ్ ఎలా ఆడుతున్నాడు.. గేమ్ నచ్చిందా.. లేదా తన బిహేవియర్ నచ్చి వేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. తను ఎప్పుడూ సింపతి కార్డ్ వాడలేదు. నాగార్జున సార్ కు సెల్యూట్ కొట్టాడు అంటే.. నాగ్ సార్ అడిగారు కాబట్టి కొట్టి చూపించారు. అంతేకానీ అందులో ఏం లేదు. తన మీద బ్యాడ్ న్యూస్ ప్రచారం చేయకండి ” అంటూ కళ్యాణ్ కు సపోర్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..