
బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. మొన్నటి వరకు హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రచ్చ మాములుగా జరగలేదు. అనవసరమైన విషయాలకు గొడవలు పడుతూ.. అరుస్తూ నానా హంగామా చేశారు. ముఖ్యంగా రమ్య మోక్ష, మాధురి మాటలు, పర్సనల్ అటాక్ కామెంట్లతో జనాలకు విసుగు వచ్చేసింది. దీంతో గత వారం రమ్య మోక్షకు అంతగా ఓటింగ్ రాకపోవడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం ప్రేక్షకులతోపాటు హౌస్మేట్స్ కు షాకిచ్చాడు బిగ్ బాస్. షోకు ముందు నాగార్జున చెప్పినట్లుగానే ఈసారి హౌస్ లో ఊహించని ట్విస్టులు ఎన్నో జరగుతున్నాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి హౌస్ లోకి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను తిరిగి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి తీసుకువచ్చి వారితో హౌస్మేట్స్ ను నామినేట్ చేయించారు. ఇక ఇప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లలో ఇద్దరిని తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. భరణి, దమ్ము శ్రీజ.
ఇక దమ్ము శ్రీజ ఎంట్రీతో అడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీజ రాకతో ఇక హౌస్ లో రణరంగమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో భరణి, శ్రీజ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరి చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పగా.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చి భరణి, శ్రీజలలో తమకు నచ్చని విషయాలను మార్చుకోవాలని చెప్పారు. అందులో భాగంగా ముందుగా ఇమ్మాన్యూయేల్ వచ్చి.. శ్రీజ గురించి మాట్లాడారు. ఏదైనా గొడవ జరిగితే ఆర్గ్యూ చేయడం మంచిదే.. కానీ మరీ దానిని లాగకూడదు అంటూ సలహా ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఇక తర్వాత డిమాన్ పవన్ వచ్చిన.. భరణి విషయంలో తనకు మూడు సార్లు ట్రస్ట్ (నమ్మకం) పోయిందని.. మళ్లీ మిమ్మల్ని నమ్మాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. నన్ను నమ్మడం, నమ్మకపోవడం అనేది నీ ఇష్టం. అది నీ పర్సనల్ పాయింట్ అంటూ షాకిచ్చారు భరణి. ఇక తర్వాత రావడంతోనే మాధురి వచ్చి మైండ్ యువర్ వర్డ్స్ అనే పాయింట్ శ్రీజ గురించి మిర్రర్ మీద రాసింది. నేను ఎప్పుడైనా సరే నోటికి ఏది వస్తే అది మాట్లాడను.. మీరు మాట్లాడినట్లు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఇచ్చిన సలహాను నేను యాక్సెప్ట్ చేయను అంటూ కౌంటరిచ్చింది. మొత్తానికి ఈసారి హౌస్ లో మాధురి వర్సెస్ శ్రీజ గొడవ గట్టిగానే సాగేట్టుగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?