Bigg Boss 9 Telugu : విన్నర్ అనుకుంటే రన్నర్‏గా తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9.. విన్నర్ గా ముందు నుంచి మారుమోగిన పేరు తనూజ. ఓవైపు పాజిటివిటీ.. అదే స్థాయిలో నెగిటివిటీతో కొనసాగింది. చివరి క్షణం వరకు ఈసీజన్ విన్నర్ అనే స్థాయిలో అత్యధిక ఓటింగ్ తో సత్తా చాటింది. కానీ రన్నరప్ గా నిలిచింది. కానీ చివరి వరకు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 9 Telugu : విన్నర్ అనుకుంటే రన్నర్‏గా తనూజ..
Thanuja

Updated on: Dec 21, 2025 | 9:58 PM

అగ్నిపరీక్షతో మొదలై గ్రాండ్ ఫినాలేతో ముగిసింది బిగ్ బాస్ సీజన్ 9. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అంటూ విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన ఈ షో.. దేశంలోనే నెంబర్ 1 షో అయ్యింది. అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 9 ఈజ్ బెస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున ఫినాలేలో ప్రకటించారు. అయితే సీజన్ 9 అంటే మాత్రం ఠక్కున గుర్తొచ్చే పేరు ఇమ్మాన్యుయేల్. తన కామెడీతో నవ్వులు పూయించాడు. కేవలం కామెడీ మాత్రమే కాదు.. టాస్కులు సైతం ఇరగదీశాడు. మొదటి రోజు నుంచి చివరి వరకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో అటు కంటెస్టెంట్లను, ఇటు ప్రేక్షకులను నవ్వించాడు. కానీ టాప్ 3 కాకుండా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అంతా షాకయ్యారు.

ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..

ఇక టాప్ 3లో నిలిచిన డీమాన్ పవన్… ఊహించని విధంగా సూట్ కేస్ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాస్ మహారాజా రవితేజ రూ.15 లక్షల సూట్ కేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టాడు. కన్ఫెన్షన్ రూం నుంచి హౌస్ లోకి అడుగుపెట్టిన రవితేజను చూడగానే పరుగున వెళ్లి కాళ్లపై పడ్డాడు కళ్యాణ్. అనంతరం రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్ కేస్ కళ్యాణ్, తనూజ వద్దని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత డీమాన్ పవన్ రూ.15 లక్షల ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేశాడు డీమాన్.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…

చివరగా.. కళ్యాణ్ పడాల, తనూజ విన్నర్ రేసులో పోటీపడ్డారు. చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య నెలకున్న తర్వాత బిగ్ బాస్ విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల. తక్కువ వ్యత్సాసంతో బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచింది తనూజ.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..

 

ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..