
అడియన్స్ అస్సలు ఊహించని విధంగా నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు ఆల్ రౌండర్ ఇమ్మాన్యూయేల్. బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ప్రతి సందర్భంలో తన కామెడీ పంచులతో హౌస్ లో నవ్వులు పూయించాడు. బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమ్మాన్యుయేల్ అన్నట్లుగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఒకానొక సమయంలో సీజన్ 9 విన్నర్ అనే రేంజ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ 1లో దూసుకొచ్చాడు. ఇదివరకు చాలా మంది కమెడియన్స్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటికీ.. ఈ రేంజ్ లో ఎవరూ ఎంటర్టైన్మెంట్ చేయలేదను అన్నట్లుగా అడియన్స్ నుంచి ఫుల్ రేంజ్ గ్రాఫ్ సొంతం చేసుకున్నాడు ఇమ్మాన్యుయేల్. నిజానికి సోషల్ మీడియాలో ఓటింగ్ ప్రకారం టాప్ 3లో ఉన్న ఇమ్మూ.. బిగ్ బాస్ లెక్కల ప్రకారం నాలుగో స్థానంలో బయటకు వచ్చాడు. దీంతో కంటెస్టెంట్లతోపాటు అడియన్స్ సైతం షాకయ్యారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…
అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇద్దరు బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై అనగనగ ఒకరాజు గ్లింప్స్ రిలీజ్ చేశారు. అనంతరం.. డాగ్ రోబోతో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నవీన్, మీనాక్షి.. ఇమ్మూను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకువచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..
ముందుగా హౌస్మేట్స్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. హౌస్ లో ఫుడ్ దొంగిలించిన కంటెస్టెంట్ ఎవరని అడగ్గా.. తనూజను చూపించింది రోగ్.. హౌస్ లో ఎక్కువగా కుళ్లు జోకులు వేసింది డీమాన్ పవన్ అని చూపించింది. చివరగా.. ఇమ్మాన్యుయేల్ వద్ద నిల్చోగా.. ఇమ్మూ జర్నీ ముగిసింది అంటూ నాగార్జున అనౌన్స్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..
ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..