Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌తో హరితేజ బాగానే సంపాదించిందిగా! ఐదు వారాలకు ఏకంగా అన్ని లక్షలా?

|

Nov 29, 2024 | 5:24 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం పూర్తయ్యింది. అయితే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య కారణాలతో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. ఆడియెన్స్ ఓట్లు తక్కువ రావడంతో హరితేజ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌తో హరితేజ బాగానే సంపాదించిందిగా! ఐదు వారాలకు ఏకంగా అన్ని లక్షలా?
Hari Teja
Follow us on

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుంది. ఈ 10 వారాల్లో ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం (నవంబర్ 10) నాటి ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. పలు అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకు వస్తే.. ఆడియెన్స్‌ ఓట్ల కారణంగా హరితేజ ఎలిమినేట్ అయింది. వీరిద్దరూ గతంలో కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. గంగవ్వ సంగతి పక్కన పెడితే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో సెకెండ్ రన్నరప్ గా నిలిచిన హరితేజ ఈ సీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ. హౌస్‌లో ఉన్నంతకాలం యాక్టివ్ గా కనిపించిన ఆమె టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో ఆమెకు పెద్దగా ఫ్యాన్‌ బేస్‌ క్రియేట్‌ కాలేదని తెలుస్తోంది. ఓట్లు తక్కువగా పడడంతో హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న హరితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో ఆసక్తికరంగా మారింది.

రూ. 17 లక్షలకు పైగానే..

సినిమాలు, సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలో నూ హరి తేజకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా ఆమె రోజుకు రూ. 50 వేల పారితోషకం అందుకుందట. అలా వారానికి గానూ రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం ఐదు వారాలపాటు ఉన్నందుకు హరితేజ రూ. 17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకుందని సమాచారం. కాగా ఇటీవల రిలీజైన ఎన్టీఆర్ దేవర సినిమాలో హరితేజ ఓ కీలక పాత్రలో కనిపించింది. హీరోయిన్ జాన్వీ పాత్రలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ బజ్ లో హరితేజ, గంగవ్వ..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.