బిగ్‌బాస్ షో నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. షో ప్రారంభంలో తన భార్య, బిడ్డల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ, వారి కోసమైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానంటూ ప్రగల్భాల పలికాడు మణికంఠ. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ తెగ ఎమోషనల్ అయ్యాడు. చిటికీ మాటకీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ స్టార్, సింపతీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇది హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కు కూడా చిర్రాకు తెప్పించింది. ఇక ఎవరైనా తనను నామినేట్ చేస్తే చాలు.. ఆ వారమంతా తెగ టెన్షన్ పడిపోయేవాడు. తను హౌస్‌లోనే ఉండాలని తెగ బరతపించాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచే తన భార్య, బిడ్డల దగ్గరకు వెళతానని శపథాలు చేశాడు. కానీ గత వారం సీన్ మొత్తం మారిపోయింది. ఏమైందో ఏమో ఇక హౌస్ లో ఉండలేనన్నాడు మణికంఠ. ఇంటికి వెళ్లిపోతానంటూ తెగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరోగ్యం బాగోలేదు.. తన మైండ్ పని చేయట్లేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి మహా ప్రభో అంటూ బిగ్ బాస్ ను వేడుకున్నాడు.
నాగ మణికంఠ పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టర్ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అయినా సరే హౌస్‌లో సర్దుకోలేకపోయాడు మణికంఠ. అతడు కోరుకున్నట్లుగానే నాగార్జున బయటకు పంపించేశారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. నాగ మణికంఠ రోజుకు 17 వేల 142 రూపాయలు చొప్పున వారానికి రూ. 1,20,000 (లక్షా 20 వేల రూపాయలు) పారితోషికం తీసుకునేవాడని సమాచారం. ఈ లెక్కన ఏడు వారాల్లో సుమారు రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం.
💥 Manikanta’s journey in the Bigg Boss house may have come to an end, but his gameplay and strategy were truly commendable! From bold moves to unforgettable moments, he gave his all and left a lasting impression on both the housemates and viewers alike. #BiggBossTelugu8 #StarMaa pic.twitter.com/L7GdDnM644
— Starmaa (@StarMaa) October 20, 2024
🌟 Don’t miss Naga Manikanta’s exclusive exit interview! Join Naga Manikanta and anchor Arjun for an engaging post-elimination chat packed with laughter, surprises, and heartfelt reflections on his journey. Catch all the fun and surprises only on #BiggBossTelugu8 #BiggBossBuzzz pic.twitter.com/Pm4tVysTb8
— Starmaa (@StarMaa) October 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.