బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కొత్త సీజన్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఏడో వారంలో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గొడవలు, ఓటింగ్ తగాదాలు తప్పితే బిగ్ బాస్ షోపై ఎలాంటి విమర్శలు కానీ, నెగెటివిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు మొదటి సారిగా ఓ సున్నితమైన విషయంలో బిగ్ బాస్ షోపై విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో మతం, కులం తదితర విషయాల ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో ఉండ కూడదు. కేవలం కంటెస్టెంట్స్ వర్క్స్, కుటుంబ సభ్యుల గురించే ప్రస్తావన ఉంటుంది. అయితే మొదటిసారి బిగ్ బాస్ హౌస్‌లో అది కూడా మన తెలుగు బిగ్ బాస్ లో కమ్యూనిటీ గురించి చర్చ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నబీల్ అఫ్రీదీ. తన ఆట,మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకున్నాడు. ఇక ఇదే సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు మెహబూబ్. ఇప్పుడు వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లో కమ్యూనిటీపై మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నెట్టింట వైరలవుతోన్న ఈ వీడియోలో మెహబూబ్ ఏమన్నాడంటే.. ‘మనకు దారుణమైన ప్లస్ ఏంటంటే మనకు మన కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు కూడా దారుణంగా పడతాయి. కానీ మన ఇద్దరం ఒక విషయాన్ని గ్రహించాలి. అదేంటంటే.. నామినేషన్స్ లో ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరూ ఉండకూడదు. అప్పుడే ఓట్లు చీలకుండా అంటాయి’ అని చెప్పుకొచ్చాడు. దీనికి నబిల్ కూడా అవును అంటూ తల ఊపాడు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియెన్స్, అభిమానులు, నెటిజన్లు మెహబూబ్, నబీల్ పై మండి పడుతున్నారు. చివరకు బిగ్ బాస్ హౌస్ లో కూడా కులం-మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
This is really worst situation in this seasons were contestants are discussing about nominations & communities. Rey #Nabeel & #Mehaboob edhe video chusi ah community vaale mee vaipu kuda chudaru🤮🤮#BiggBossTelugu8 #Biggboss @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/V6D7j3rjzH
— P M ESWAR NARAYANᶠᴬᴺ ᴮᴼʸ (@eswarnarayan_pm) October 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.