Bigg Boss 8 Telugu Finale Highlights: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్

|

Dec 15, 2024 | 11:02 PM

Bigg Boss Telugu season 8 Grand Finale Highlights: సుమారు 3 నెలల పాటు రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. ఆదివారం (డిసెంబర్ 15)జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో నిఖిల్ ను విజేతగా ప్రకటించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

Bigg Boss 8 Telugu Finale Highlights: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్
 Bigg Boss 8 Telugu Grand Finale

అందరూ ఊహించినట్టే  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. ఆదివారం (డిసెంబర్ 15) జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిఖిల్ ను విజేతగా ప్రకటించాడు. ఇక తెలుగు నటుడు గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. కాగా సుమారు 105 రోజుల పాటు రసవత్తరంగా సాగిన ఈ రియాలిటీషో  ఆదివారం తో ముగిసింది.   కాగా ఈసీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. మొదట 14 మంది మెయిన్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా, ఐదు వారాల తర్వాత మరో 8 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక చివరకు ఐదుగురు మిగిలారు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసులో నిలిచారు. మరి వీరిలో ఎవరు రూ.55 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకోనున్నారు? ఎవరు రన్నరప్‌గా నిలవనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టీవీ 9 తెలుగును ఫాలో అవ్వండి.. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం అందించేందుకు రెడీగా ఉంది.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Dec 2024 10:42 PM (IST)

    బిగ్ బాస్ విజేతగా నిఖిల్

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ నిలిచాడు. తెలుగబ్బాయి గౌతమ్ కృష్ణ రన్నరప్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు. అంతకు ముందు అవినాశ్, ప్రేరణ, నబీల్ ఎలిమినేట్ అయ్యారు.

  • 15 Dec 2024 09:55 PM (IST)

    రామ్ చరణ్ ఎంట్రీ..

    బిగ్ బాస్ స్టేజీ మీదకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. చెర్రీ అయ్యప్ప మాల, దుస్తుల్లో బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చాడు.  మరికాసేపట్లో విజేత పేరును అనౌన్స్ చేయనున్నారు.

  • 15 Dec 2024 09:54 PM (IST)

    ఓరుగల్లు బిడ్డ నబీల్ ఎలిమినేట్

     

    బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన విజయ్ సేతుపతి, మంజు వారియర్ టాప్ 3 కంటెస్టెంట్‌గా నబీల్‌ను ఎలిమినేట్ చేసి స్టేజీపైకి తీసుకొచ్చారు. దీంతో  ఓరుగల్లు బిడ్డ ఎలిమినేట్ అయ్యాడు.

  • 15 Dec 2024 09:37 PM (IST)

    ప్రేరణ ఎన్ని లక్షలు సంపాదించింటే?

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్‌ 5లో నిలిచిన ఏకైక మహిళ ప్రేరణ. ఇక  గ్రాండ్ ఫినాలేలో  తనకు సూట్‌కేస్‌ ఆఫర్‌ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పిందీ అందాల తార.కాగా ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు  సొంతం చేసుకుందని తెలుస్తోంది.

  • 15 Dec 2024 09:32 PM (IST)

    అవినాశ్ కు భారీగా రెమ్యునరేషన్..

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న అవినాశ్ కు వారానికి రూ. 2 లక్షల చొప్పున పారితోషకం అందినట్లు టాక్. ఈ లెక్కన మొత్తం 10 వారాలకు గానూ అవినాశ్ కు రూ. 20 లక్షలు దక్కినట్లు సమాచారం.

  • 15 Dec 2024 09:28 PM (IST)

    ప్రేరణ బయటకు..

    బిగ్ బాస్ టాప్ – 5 ఫైనలిస్టులలో మరొకరు బయటకు వచ్చారు. ఇందుకోసం నటి ప్రగ్యా జైస్వాల్‌ని లోపలికి పంపించారు. ఆమె ప్రేరణను ఎలిమినేట్ చేసి తన వెంట బిగ్ బాస్ స్టేజ్ మీద తీసుకుని వెళ్లింది.

  • 15 Dec 2024 09:16 PM (IST)

    కమెడియన్ అవినాశ్ ఎలిమినేట్

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో భాగంగా మొదటగా కమెడియన్ అవినాశ్ ఎలిమినేట్ అయ్యాడు. కన్నడ నటుడు ఉపేంద్ర అతనిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో అవినాష్ అన్న, తండ్రి ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు.
  • 15 Dec 2024 08:48 PM (IST)

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్రోఫీ ఆవిష్కరణ

    బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ట్రోఫీని నాగార్జున ఆవిష్కరించారు. 8 ఆకారంతోపాటు కన్ను సింబల్ వచ్చి.. ఇన్ఫినిటీ గుర్తు చూపిస్తూ ట్రోఫీ ఉంది. మరి దీనిని ఎవరు అందుకుంటారో మరికాసేపట్లో తేలనుంది.

  • 15 Dec 2024 08:39 PM (IST)

    బిగ్ బాస్ విజేత ఎవరంటే?

    మరికాసేపట్లో బిగ్ బాస్ సీజన్ 8 విజేతను ప్రకటించనున్నారు. అయితే అప్పుడే విన్నర్ ఎవరనే లీక్ బయటకు వచ్చేసింది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించాడని తెలుస్తోంది. తెలుగబ్బాయి గౌతమ్‌ రన్నరప్ టైటిల్‌తోనే సరిపెట్టుకున్నాడని సమాచారం.

  • 15 Dec 2024 08:11 PM (IST)

    గీతా మాధురి సందడి..

    ఇక బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేలో సెలబ్రిటీలు ఒక్కొక్కరూ వస్తున్నార. ఇందులో స్టార్ సింగర్స్ కూడా సందడి చేశారు. సింగర్ గీతా మాధురి కూడా తన పాటలతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను అలరించింది.
  • 15 Dec 2024 08:09 PM (IST)

    విన్నర్ ప్రైజ్ మనీని చూపించిన నాగార్జున

    బిగ్ బాస్ తెలుగు సీ జన్ 8 గెలుచుకోబోయే ఫ్రెజ్ మనీని చూపించారు నాగార్జున.  మొత్తం 54,99,999 కాగా రౌండ్ ఫిగర్ చేసి రూ. 55 లక్షలుగా ప్రైజ్ మనీని నిర్ణయించారు.

     

     

  • 15 Dec 2024 08:01 PM (IST)

    105 రోజుల బిగ్ బాస్ సీజన్ 8 జర్నీ వీడియో

    105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 జర్నీ వీడియోను గ్రాండ్ ఫినాలో ప్లే చేశారు. కంటెస్టెంట్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం, సంతోషంగా ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను ఈ వీడియో లో చూపించారు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు.
  • 15 Dec 2024 07:55 PM (IST)

    స్పెషల్ డ్రెస్ తో టేస్టీ తేజ హంగామా..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసమే స్పెషల్‌గా డ్రెస్ డిజైన్ చేసుకుని వచ్చానని టేస్టీ తేజ నాగ్ తో చెప్పాడు. దీనికి స్పందించిన అక్కనేని హీరో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  ‘వైట్ కలర్, హారిజాంటల్ లైన్స్ లావుగా ఉన్నవాళ్లకు సూట్ కావు. ముందు పెళ్లి చేసుకో అప్పుడు నేను నీకు ఏం వేసుకోవాలో చెబుతాను’ అని రిప్లై ఇచ్చాడు.

  • 15 Dec 2024 07:50 PM (IST)

    పుష్ప 2 సాంగ్‌కి గౌతమ్ డ్యాన్స్..

    బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేలో టైటిల్ ఫేవరెట్ గౌతమ్ పుష్ప సాంగ్‌కి దుమ్ములేపే స్టెప్స్ వేశాడు. గొడ్డలి పట్టుకుని ఎనర్జిటిక్ స్టెప్పులేశాడు.  అతడి తర్వాత నబీల్.. ఇస్మార్ట్ శంకర్ సాంగ్‌కి స్టెప్స్ వేశాడు. తర్వాత అవినాష్, నిఖిల్, ప్రేరణలు కూడా తమదైన శైలిలో డ్యాన్స్ లు చేస్తూ షో ను రక్తి కట్టించారు.
  • 15 Dec 2024 07:34 PM (IST)

    అతనే విన్నర్ గా నిలవాలి..

    కాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో చాలా మంది గౌతమ్ విన్నర్ గా నిలవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో నిఖిల్ గెలిస్తే బాగుంటుందని మరికొందరు కోరుకుంటున్నారు.

  • 15 Dec 2024 07:20 PM (IST)

    ఆ ముగ్గురు తప్ప.. అందరూ వచ్చేశారు..

    ఈ సీజన్ లో  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. మొదటివారం నుంచి ఎలిమినేట్ అయిన వరుస క్రమంలోనే కూర్చోగా.. నాగార్జున వారితో మాట్లాడించారు. కాగా విష్ణుప్రియ, హరితేజ, నయని పావని మాత్రం ఫినాలేకు డుమ్మా కొట్టేశారు.

  • 15 Dec 2024 07:19 PM (IST)

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రారంభం..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా మొదలైంది. ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చారు.  దేవర మూవీలోని పెళ్లి డాన్స్‌తో మన్మథడు అలరించారు

  • 15 Dec 2024 07:06 PM (IST)

    మొబైల్ ఫోన్లపై నిషేధం

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశార నిర్వాహకులు.  కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌ కళ్లకి గంతలు కట్టి మరీ షూటింగ్  స్పాట్ కు తీసుకుని వెళ్తున్నారట. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఫోన్లు కూడా తీసుకుంటున్నారట. విన్నర్ ఎవరనే లీక్ బయటకు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బేబక్క ఓ వీడియో షేర్ చేసింది.

    బెజవాడ బేబక్క షేర్ చేసిన వీడియో..

  • 15 Dec 2024 06:54 PM (IST)

    చీఫ్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. అధికారిక ప్రకటన..

    బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ వస్తున్నట్లుగా అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ మేరకు స్టార్ మా ఒక వీడియోను షేర్ చేసింది..

  • 15 Dec 2024 06:48 PM (IST)

    అన్నపూర్ణ స్డూడియోస్ వద్ద భారీ బందో బస్తు

    గత సీజన్‌ గ్రాండ్ ఫినాలే సందర్భంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి అన్న పూర్ణ స్టూడియోస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ర్యాలీలు, విజయోత్సవాలకు పర్మిషన్ ఇవ్వలేదు.  అలాగే విన్నర్, రన్నర్‌ని రాత్రికి అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే ఉంచి.. తెల్లవారుజామున 3 తరువాతే  బయటకు పంపించనున్నారు

Follow us on