బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముందు వరకు నబీల్ అఫ్రీది పేరు చాలా మందికి తెలియదు. అందుకే హౌస్ లో అతను అడుగుపెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ బిగ్ బాస్ గేమ్ ను బాగా వంటపట్టించుకున్నాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ వోటింగులో టాప్ లోకి దూసుకెళ్లాడు. తన ఆట, మాట తీరు కూడా బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకానొక దశలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ నబీల్ దేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ సీజన్ చివరకు వచ్చేసరికి నబీల్ పై నెగెటివిటీ పెరిగిపోయింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ తో కలిసి కమ్యూనిటీ పై చర్చ జరపడం. దీని తర్వాత నబీల్ అఫ్రీది ఆట పరంగానూ బాగా స్లో అయ్యాడు. ఓటింగ్ శాతం కూడా తగ్గింది. ఫలితంగా టైటిల్ రేసులో వెనక పడిపోయాడు. టాప్ -5లో చోటు దక్కించుకున్నా మూడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అవినాశ్, ప్రేరణల తర్వాత బయటకు వచ్చాడు నబీల్.
కాగా బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా అఫ్రిదీ రెమ్యునరేషన్ గట్టిగానే అందుకున్నాడని తెలుస్తోంది. వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తమ్మీద 15 వారాలకు గానూ రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ యూట్యూబర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన నబీల్ అఫ్రీదికి ఇది భారీ పారితోషికమనే చెప్పుకోవాలి.
కాగా నబీల్ వరంగల్‌కు చెందిన ఒక యూట్యూబర్. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్ డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు చేస్తుంటాడు. దీంతో సోషల్ మీడియాలోనూ నబీల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ తోనే సోషల్ మీడియాలో అడుగు పెట్టి టాప్ -3లో నిలిచాడు. మరి ఈ బిగ్ బాస్ క్రేజ్ అతని కెరీర్ కు ఏ మేర సహాయపడుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.